NTV Telugu Site icon

PM Modi: తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం సహకరిస్తోంది: ప్రధాని మోడీ

Pm Modi Speech

Pm Modi Speech

PM Modi Speech in Adilabad: తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం సహకరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పేదలు, దళితుల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు చేపట్టిందని.. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలు నిదర్శనం అని అన్నారు. ఆదిలాబాద్‌లో రూ.7వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో పాటు పలు రైల్వే అభివృద్ధి పనులను ప్రధాని ఈరోజు ప్రారంభించారు.

అభివృద్ధి పనులను ఆయారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ‘దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్‌ కార్యక్రమాలు ఓ నిదర్శనం. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు అవుతోంది. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే మా ఆకాంక్ష. హైవేలను అభివృద్ధి చేస్తున్నాం. వికసిత్ భారత్‌ లక్ష్యంగా మేం పాలన సాగిస్తున్నాం. రూ.56వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. ఎన్టీపీసీ రెండో యూనిట్‌తో తెలంగాణకు విద్యుత్ అవసరాలు తీరుతాయి. 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఎన్టీపీసీని జాతికి అంకితం చేశాం’ అని అన్నారు.

Also Read: PM Modi: తెలంగాణలో 56వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోడీ!

‘ఆర్ధిక వ్యవస్థ బలపడితే రాష్ట్రాలకు లాభం కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ బలపడితే దేశంపై విశ్వాసం పెరుగుతుంది. పేదలు, దళితుల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. వచ్చే పదేళ్లలో భారత్‌ అభివృద్ధిపరంగా మరింత ముందుకు దూసుకెళుతుంది. కేంద్రం తీసుకున్న చర్యలతో దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. దేశ ప్రజల కోసం మరింత అభివృద్ధి చేస్తాం. నాకు ప్రజలే ముఖ్యం’ అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

 

 

Show comments