NTV Telugu Site icon

PM MODI: ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం

Modi Pm

Modi Pm

ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య దాదాపు 290 మందికి పైగా చేరింది. అదే సమయంలో 1000 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొంతుదున్న బాధితులను పరామర్శించారు.

Also Read : Manchu Vishnu: వెన్నెల కిషోర్ కు అమ్మాయిల పిచ్చి.. వాళ్ళ కాలనీలో అమ్మాయిలు

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. అయితే ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ అన్నారు. ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని, బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తప్పకుండా తీసుకుంటామన్నారు.

Also Read : Delhi Crime: యువతి అందుకు ఒప్పుకోలేదని.. కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమన్న మోడీ.. ఈ ఘటనలో చాలా రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యల్లో ఒడిశా ప్రభుత్వం అన్ని విధాల సహకరించిందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన అదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.

Also Read : Ashok Swain: ప్రధాని గంటకోసారి బట్టలు మార్చినంత మాత్రాన దేశం గొప్పగా మారదు

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఒడిశా ఘటనపై ప్రపంచ దేశాలకు చెందిన పలు దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.