NTV Telugu Site icon

Atal Setu: ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

Pm Modi

Pm Modi

Prime Minister Modi: మహారాష్ట్రలోని ముంబాయి నగరంలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ముంబాయిలోని సేవ్రీ నుంచి రాయగఢ్ జిల్లాలోని సహవా శేవాను కలుపుతూ 17వేల 840 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆరు లైన్లుగా నిర్మించారు. ఇక, 2016 డిసెంబర్ నెలలో ప్రధాని మోడీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గౌరవార్ధం ఈ బ్రిడ్జ్ కు అటల్ సేతు అని నామకరణం చేశారు.

Read Also: Kaushik Reddy: మాణికం ఠాగూర్ పై కోమటి రెడ్డి సోదరులు చెప్పిందే మేము చెప్పాం..

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాసిక్ కాలారామ్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మాట్లాడుతూ.. ఇవాళ నాసికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.. అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ నాసిక్ లో ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. పంచవటి ప్రాంతంలో సీతారాములు చాలా కాలం ఉన్నారు.. అన్ని ఆలయాల్లో పరిశుభద్రత క్యాంపైన్ ను మొదలి పెట్టాలి అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇక, ప్రపంచంలోనే భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. టెక్నాలజీ రంగంలో భారత్ వృద్ధి సాధిస్తుందని చెప్పుకొచ్చారు..