రామ మందిరంపై స్మారక తపాలా స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు. దాంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముడిపై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రారంభించారు. తపాలా స్టాంపు రూపకల్పనలో రామాలయం, చౌపాయి ‘మంగల్ భవన్ అమంగల్ హరి’, సూర్య, సరయూ నది, ఆలయం చుట్టూ ఉన్న విగ్రహాలు ఉన్నాయి. ఇవి.. భారతదేశం, అమెరికాతో సహా మొత్తం 21 దేశాలలో విడుదలయ్యాయి.
Jallikattu bull: ఎద్దుకు బలవంతంగా కోడిని తినిపించిన ఓ వ్యక్తి.. కేసు నమోదు
కాగా.. ప్రధాని మోదీ విడుదల చేసిన స్టాంపుల పుస్తకంలో 6 స్టాంపులు ఉన్నాయి. వాటిల్లో రామాలయం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, మా శబరిపై పోస్టల్ స్టాంపులు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పోస్టల్ స్టాంపు పనితీరు గురించి మనందరికీ తెలుసు కానీ, పోస్టల్ స్టాంపులు మరో ముఖ్యపాత్ర పోషిస్తాయని అన్నారు. చరిత్ర, చారిత్రక సందర్భాలను తర్వాతి తరానికి తెలియజేసేందుకు పోస్టల్ స్టాంపులు ఒక మాధ్యమం అని తెలిపారు. ఇది కేవలం కాగితం ముక్క కాదని.. ఇది చరిత్ర పుస్తకమన్నారు. దీనిలో రూపాలు చారిత్రక క్షణాల చిహ్న రూపమని పేర్కొన్నారు. యువతరం వీటి నుండి చాలా తెలుసుకుంటుంది.. నేర్చుకుంటుందని మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ తాను అభినందనలు తెలియజేస్తున్నానని ప్రధాని అన్నారు.
CM Jagan: మేనల్లుడి నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్ దంపతులు
