NTV Telugu Site icon

PM Modi: అమిత్ షా ఫేక్ వీడియోలు వైరల్.. ప్రధాని మోడీ సీరియస్..!

Modi

Modi

ఎన్నికల వేళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ అమిత్ షా చెప్పినట్లుగా కొన్ని ఫేక్ వీడియోలు నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలను ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల అస్త్రంగా మల్చుకుని బీజేపీపై విమర్శలు గుపిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న అమిత్ షా ఫేక్ వీడియోలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. ఈ ఇష్యూపై ఇవాళ (సోమవారం) ఆయన మాట్లాడుతూ.. ఫేక్ వీడియోలు సృష్టించే వాళ్లకు తగిన గుణపాఠం చెబుతామంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు.

Read Also: Jairam Ramesh: మోడీ ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు..

కాగా, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హెచ్చరికలు జారీ చేశారు. ఓడిన వాళ్లే ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అమిత్ షా ఫేక్ వీడియోల వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, భారతీయ జనతా పార్టీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అమిత్ షా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.