NTV Telugu Site icon

Italy G7 Summit: పోప్ ఫ్రాన్సిస్‌-మోడీ ఆత్మీయ ఆలింగనం.. వీడియో వైరల్

Pop

Pop

ఇటలీలో జరుగుతున్న జీ 7 సమ్మిట్ ఆద్యంతం సందడి.. సందడిగా సాగుతోంది. అగ్ర నేతలంతా ఇటలీలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఒకరినొకరు పలకరించుకుంటూ ఉత్సాహంగా సాగుతున్నారు. ఇక ప్రధాని మోడీ.. ఆయా దేశాధినేతలతో సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే G7 సమ్మిట్‌లో భాగంగా అవుట్‌రీచ్ సెషన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోస్ ఫ్రాన్సిస్‌-మోడీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అంతేకాకుండా కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా బ్రిటీష్ ప్రధాని రిషి సునక్‌తో కూడా మోడీ సంభాషించారు.

 

ఇదిలా ఉంటే జీ 7 సమ్మిట్‌లో తొలిసారి పోప్ ప్రసంగించనున్నారు. సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న తాజా పరిణామాలను ఉద్దేశించి పోప్ ప్రసంగించనున్నారు.