Site icon NTV Telugu

Delhi: పీఎంవో సిబ్బందితో మోడీ భేటీ.. అభివృద్ధి ప్లాన్‌పై చర్చ

Mdoe

Mdoe

ఢిల్లీలో పీఎంవోలో ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం సిబ్బందితో మోడీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మోడీ పలు కీలక సూచనలు చేశారు. ఇది ప్రజల పీఎంవో అని.. మోడీ పీఎంవో కాదని పేర్కొన్నారు. అభివృద్ధికి అధికారులు ఒక వారధిలాంటివారు అని చెప్పారు. తాను అధికారంలో కోసమో. పదవి కోసమో లేనన్నారు. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయులు తనకు పరమాత్మతో సమానం అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. త‌మ‌కు ఒకటే ల‌క్ష్యం ఉంద‌ని.. ఈ దేశ‌మే ప్రప్రథ‌మం అన్నారు. ఒకే స్పూర్తితో ప‌నిచేస్తున్నామ‌ని.. 2047 నాటికి విక‌సిత భార‌త్ నిర్మించాల‌న్నారు. త‌న జీవితంలో ప్రతి క్షణం దేశం కోసమే అని ప్రధాని మోడీ పీఎంవో సిబ్బందితో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Lok sabha spekar: స్పీకర్‌ పదవిపై కన్నేసిన కింగ్ మేకర్లు.. మోడీ ప్లాన్ ఇదేనా?

ఇదిలా ఉంటే ఆదివారం కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. 72 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానాలు గెలుచుకుంది. ఇక బీజేపీ సొంతంగా 240 సీట్లు దక్కించుకుంది. మ్యాజిక్ ఫిగర్ మాత్రం చేరుకోలేకపోయింది. మోడీ ప్రమాణస్వీకారానికి విదేశీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: Nandini Reddy: తీవ్ర విషాదంలో నందిని రెడ్డి.. ఏమైందంటే?

Exit mobile version