ప్రధాని మోడీ శుక్రవారం హిమాచల్‌ప్రదేశ్ మండీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా చివరి విడతలో జూన్ 1న మండీ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మండీలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండి బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్… ప్రధానికి గులాబీ పువ్వుతో స్వాగతం పలికారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేశారు.
ప్రధాని మోడీ స్టేజ్ మీదకు రాగానే కంగనా రనౌత్ నమస్కారం చేసి ఎర్ర గులాబీని అందజేశారు. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ… మండీకి స్వాగతం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక కంగనా రనౌత్ క్రీమ్ చీరతో హిమాచలీ టోపీని ధరించారు. ఇక ఈ కార్యక్రమానికి స్థానికులు భారీగా తరలివచ్చినట్లు కంగనా ఫొటోలు పంచుకున్నారు. ఈ పోస్ట్‌పై ఓ అభిమాని చాలా అద్భుతం అని వ్యాఖ్యానించారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. ఆరో విడత శనివారం జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. మండీ నియోజకవర్గానికి కూడా జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
Mandi mein aapka swagat hai Pradhanmantri ji 🥰🙏💐 pic.twitter.com/gq2xlyKjwB
— Kangana Ranaut (@KanganaTeam) May 24, 2024
