ఢిల్లీ మెట్రో ఫేజ్ 4కు గురువారం ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియానికి చేరుకున్న ఆయన మెట్రో పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఢిల్లీకి చెందిన 5 వేల మంది ఎస్వీలతో సహా లక్ష మంది వీధి వ్యాపారులకు (ఎస్‌వీ) పథకం కింద రుణాలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ మెట్రో 4వ దశకు సంబంధించిన రెండు అదనపు కారిడార్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
కొత్త కారిడార్లు ఇందర్‌లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు.. లజపత్ నగర్ నుంచి సాకేత్ జి బ్లాక్‌కు అనుసంధానం చేయబడతాయి. దాదాపు 20 కిలోమీటర్ల మేర ఈ మెట్రో నిర్మాణం జరగనుంది. దీని ద్వారా కనెక్టివిటీ సుగమం అయితే ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అలాగే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రజలకు తాయిలాలు కూడా ప్రకటించారు. ఇటీవల మహిళల కోసం వంట గ్యాస్ రూ.100 తగ్గించారు. అలాగే సీఏఏ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
ఇదిలా ఉంటే త్వరలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. గురువారం ఎన్నికల సంఘంలోకి ఇద్దరు అధికారులు కొత్తగా నియామకం జరిగింది. నోటిఫికేషన్ విడుదలకు ఎన్నికల సంఘం సిద్ధపడుతోంది. ఏ క్షణములోనైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
#WATCH | Prime Minister Narendra Modi lays the foundation stone of two additional corridors of Delhi Metro’s Phase 4 during the programme at Jawaharlal Nehru Stadium in Delhi. pic.twitter.com/KmBoagL9ZL
— ANI (@ANI) March 14, 2024
#WATCH | Prime Minister Narendra Modi arrives at Jawaharlal Nehru Stadium in Delhi.
He will address beneficiaries of PM SVANidhi scheme here, shortly. He will also distribute loans under the scheme to 1 lakh street vendors (SVs), including 5,000 SVs from Delhi on this occasion.… pic.twitter.com/p7mXDu7zc8
— ANI (@ANI) March 14, 2024