NTV Telugu Site icon

PM Modi: తెలంగాణలో 56వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోడీ!

Pm Modi

Pm Modi

PM Modi unveils projects worth 56000 Crore in Telangana: తెలంగాణలో 56 వేలకోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం రామగుండం ఎన్‌టీపీసీ రెండో యూనిట్‌ను ఆరంబించారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా తెలంగాణకు 85 శాతం విద్యుత్ సరఫరా అవుతుంది. ప్రధాని ఆరంభించిన ప్రాజెక్టులలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో తెలంగాణను కలిపే రెండు హైవే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

‘భారత్ దర్శన్’లో భాగంగా మార్చి 4 నుంచి 12 వరకు తొమ్మిది రోజుల పాటు 10 రాష్ట్రాలు సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు రాజస్థాన్‌లను ప్రధాని మార్చి 4 నుంచి 12 మధ్య పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.

Also Read: Crime News: శంకర్‌పల్లిలో దారుణం.. ముగ్గురు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి!

ఆర్టికల్ 370 రద్దు తర్వాత మార్చి 7న గాల్వాన్ లోయలో ప్రధాని మోడీ తొలిసారిగా పర్యటించడం విశేషం. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మార్చి 6 సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం కోసం ఢిల్లీకి వెళతారు. అక్కడ పార్టీ అభ్యర్థుల రెండవ జాబితాను నిర్ణయిస్తారు. ప్రధాని మోడీ తెలంగాణ నుంచి తన పర్యటనను ఆరంభించారు. ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ కార్యక్రమంలో 56,000 కోట్ల విలువైన విద్యుత్, రైలు మరియు రహదారి రంగానికి సంబంధించిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి.. శంకుస్థాపన చేశారు.

Show comments