Vande Bharat Express: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం వారణాసి-న్యూఢిల్లీ మధ్య రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అదునాతన ఫీచర్లతో తీర్చిదిద్దిన ఈ రైలుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే పలు గూడ్స్ రైళ్లను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య తో పాటు పలువురు పాల్గొన్నారు. తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఆయన సోమవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Read Also: Covid Alert: పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తంగా ఉండాలి
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ప్రతీక అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్, దేశ రాజధాని మధ్య ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని హామీ ఇచ్చింది. డిసెంబర్ 20న సాధారణ కార్యకలాపాలను ప్రారంభించేందుకు షెడ్యూల్ చేయబడింది, ఈ రైలు వారణాసి, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, న్యూఢిల్లీలను కలుపుతుంది, యాత్రికులు, ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ వందే భారత్ రైలు మంగళవారం మినహాయించి మిగతా ఆరు రోజుల్లో ఉదయం 6 గంటలకు వారణాసిలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటల 5 నిమిషాలకు తిరిగి వారణాసికి చేరుకుంటుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్వీయ-చోదక సెమీ-హై-స్పీడ్ రైలు. అత్యుత్తమ డిజైన్, ఇంటీరియర్స్, వేగాన్ని కలిగి ఉంది. ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన మరియు సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
Read Also: Draupadi Murmu: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం
ఇదిలా ఉండగా.. ఇప్పటికే వారణాసి-ఢిల్లీ మార్గంలో ఒక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తుండగా.. రద్దీ నేపథ్యంలో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ మార్గంలో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ రైలులో అధునాతన ఫీచర్లు ఉంటాయి. వైఫై సదుపాయం, జీపీఎస్ ఆధారిత ఇన్ఫర్మేషన్ సిస్టం, బయో వాక్యూం టాయిలెట్స్, ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు, టచ్ బేస్డ్ రీడింగ్ లైట్లు వంటి అధునాతన సౌకర్యాలతో ఈ సెమీ హై స్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
