Site icon NTV Telugu

PM Modi: రాజస్థాన్‌లో HPV వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోడీ

Modi2 (2)

Modi2 (2)

రాజస్థాన్‌లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అజ్మీర్‌లో HPV వ్యాక్సినేషన్‌ను మోడీ ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులతో మోడీ సంభాషించారు. 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు బాలికలకు వ్యాక్సిన్ వేయనున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అరికట్టేందుకు ఈ వ్యాక్సిన్ చేపట్టారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల్లో బాలికలకు HPV వ్యాక్సినేషన్ వేయనున్నారు.

ఇది కూడా చదవండి: Anna Hazare: లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్‌పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో 1.15 కోట్ల మంది బాలికలకు ఉచితంగా టీకా వేయనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఆయుష్మాన్ ఆరోగ్య ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఉప-జిల్లా, జిల్లా ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లోలో టీకాలు వేయనున్నారు.

Exit mobile version