NTV Telugu Site icon

5G services: టెలికాం రంగంలో కొత్త శకం.. 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని

Pm Modi Launches 5g Services

Pm Modi Launches 5g Services

5G services: భారత టెలికాం రంగంలో నూతన శకం ప్రారంభమైంది. దేశంలో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ… దీంతో పాటు 5జీ సేవలకు కూడా శ్రీకారం చుట్టారు. ప్రగతి మైదాన్‌లోని ఎగ్జిబిషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలించారు. ఈ సేవల గురించిన డెమోనూ రిలయన్స్ జియో ఛైర్మన్‌ ఆకాశ్ అంబానీ.. ప్రధాని మోడీకి వివరించారు. 5జీ సేవలు ప్రారంభించడానికి ముందు.. టెలికాం సంస్థల స్టాళ్లను మోదీ పరిశీలించారు. అక్కడి స్టాళ్లలో కలియతిరిగారు. జియో, ఎయిర్‌టెల్ సహా పలు సంస్థల 5జీ ఉత్పత్తులను వీక్షించారు. నాలుగో పారిశ్రామిక విప్లపంగా భావిస్తున్న 5జీ సేవలు దేశంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నిర్దేశిత నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. వచ్చే రెండేళ్లలో యావత్‌ దేశమంతా 5జీ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నాయి.

ఈ 5జీ సేవల వల్ల ఏ వీడియోనైనా కొద్ది సెకన్లలోనే డౌన్‌లోడ్ అయ్యే అవకాశం ఉంది. ఫుల్ లెంత్‌ హై క్వాలిటీ వీడియోలు కూడా చిటికెలో డౌన్‌లోడ్ కానున్నాయి. ఇటీవల వేలం ప్రక్రియ సైతం పూర్తి అయ్యింది. దేశంలోని 3 ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ సేవల కోసం రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. ముకేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని జియో రూ.88, 078 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది. ఎయిర్‌టెల్ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది. అక్టోబర్‌లోనే కొత్త సేవలు రానున్నాయని ఇప్పటికే పలు సంస్థలు వెల్లడించాయి.

Gas Cylinder Price: ఢిల్లీలో వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.25.50 తగ్గింపు

భారత్‌పై 5జీ మొత్తం ఆర్థిక ప్రభావం 2035 నాటికి సుమారు రూ.36 లక్షల కోట్లకు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత 4జీతో పోలిస్తే 7నుంచి 10 రెట్ల డేటా వేగం.. 5జీ సేవల్లో లభిస్తుందని, కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు సాధ్యపడతాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ 5జీ సేవలు అమెరికా, చైనా, దక్షిణ కొరియా, యూరప్‌లోని కొన్ని దేశాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. అక్కడ కూడా ఈ సేవలు కొన్ని పట్టణాలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. 4జీ ఖర్చులతో పోలిస్తే 5జీ ఖర్చులు భారీగా ఉండకపోవచ్చని టెలికాం రంగ నిపుణులు భావిస్తున్నారు. కానీ డేటా వేగం పెరుగుతున్న కారణంగా వినియోగదారులు 5జీలో అధికంగా డేటాను వినియోగించే అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీల ఆదాయం భారీగా పెరగవచ్చని అభిప్రాయపడుతున్నారు.

Show comments