Site icon NTV Telugu

OperationDost: ‘ఆపరేషన్ దోస్త్’ సక్సెస్ చేశారు.. వెల్ డన్.. మోడీ కితాబు

Modi

Modi

OperationDost: భూకంపం కార‌ణంగా ట‌ర్కీ, సిరియా దేశాల్లో దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది భ‌వ‌నాలు కుప్పకూలిపోయాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో భూకంప బాధిత దేశాలకుసాయం చేసేందుకు భారత్ తన చేయూత అందించింది. ట‌ర్కీ, సిరియాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో స‌హాయ చ‌ర్యలు అందించేందుకు ఆప‌రేష‌న్ దోస్త్ చేపట్టింది. దీనిలో భాగంగా భార‌త్ నుంచి రెస్క్యూ, మెడిక‌ల్ బృందాల‌ను పంపింది. ఆపరేషన్ దోస్త్ కింద మోహరించిన భారత ఆర్మీ వైద్య బృందం సహాయక చర్యలు ముగియడంతో భూకంప బాధిత దేశం టర్కీ నుంచి తిరిగి వచ్చింది. ఫిబ్రవరి 6న రెండు దేశాల్లోని వివిధ ప్రాంతాలు భూకంపం బారినపడి 40 వేల మందికి పైగా మృతి చెందిన నేపథ్యంలో ట‌ర్కీతో పాటు సిరియాకు సహాయం అందించేందుకు భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ను ప్రారంభించింద‌ని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.

Read Also: Brazil Floods: బ్రెజిల్‌లో వరద బీభత్సం.. 36 మంది మృతి

భూకంపం సంభవించిన టర్కీయేలో మోహరించిన భారతీయ విపత్తు సహాయక బృందాలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సంభాషించారు. వారు పనిని సక్సెస్ చేయడంతో ప్రధాని వారిని ప్రశంసించారు. టర్కీ, సిరియాలో ‘ఆపరేషన్ దోస్త్’లో పాల్గొన్న సిబ్బందితో తాను సంభాషించానని ప్రధాని మోదీ ట్వీట్‌లో తెలిపారు. విపత్తు సహాయక చర్యలలో వారి కృషి అభినందనీయమని ఆయన అన్నారు. ఫిబ్రవరి 7న భూకంప ప్రభావిత దేశానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలన్న ప్రధాని మోదీ ఆదేశాల మేరకు మొత్తం మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అక్కడికి పంపారు. #OperationDost కింద తుది NDRF బృందం Turkiye నుండి తిరిగి వచ్చింది. 151 @NDRFHQ సిబ్బంది & డాగ్ స్క్వాడ్‌లతో కూడిన 3 బృందాలు భూకంప ప్రభావిత టర్కియేకు సహాయం అందించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్‌లో తెలిపారు.

Exit mobile version