OperationDost: ‘ఆపరేషన్ దోస్త్’ సక్సెస్ చేశారు.. వెల్ డన్.. మోడీ కితాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OperationDost: భూకంపం కారణంగా టర్కీ, సిరియా దేశాల్లో దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు కుప్పకూలిపోయాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో భూకంప బాధిత దేశాలకుసాయం చేసేందుకు భారత్ తన చేయూత అందించింది. టర్కీ, సిరియాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు అందించేందుకు ఆపరేషన్ దోస్త్ చేపట్టింది. దీనిలో భాగంగా భారత్ నుంచి రెస్క్యూ, మెడికల్ బృందాలను పంపింది. ఆపరేషన్ దోస్త్ కింద మోహరించిన భారత ఆర్మీ వైద్య బృందం సహాయక చర్యలు ముగియడంతో భూకంప బాధిత దేశం టర్కీ నుంచి తిరిగి వచ్చింది. ఫిబ్రవరి 6న రెండు దేశాల్లోని వివిధ ప్రాంతాలు భూకంపం బారినపడి 40 వేల మందికి పైగా మృతి చెందిన నేపథ్యంలో టర్కీతో పాటు సిరియాకు సహాయం అందించేందుకు భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ను ప్రారంభించిందని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.
Read Also: Brazil Floods: బ్రెజిల్‌లో వరద బీభత్సం.. 36 మంది మృతి
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

భూకంపం సంభవించిన టర్కీయేలో మోహరించిన భారతీయ విపత్తు సహాయక బృందాలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సంభాషించారు. వారు పనిని సక్సెస్ చేయడంతో ప్రధాని వారిని ప్రశంసించారు. టర్కీ, సిరియాలో ‘ఆపరేషన్ దోస్త్’లో పాల్గొన్న సిబ్బందితో తాను సంభాషించానని ప్రధాని మోదీ ట్వీట్‌లో తెలిపారు. విపత్తు సహాయక చర్యలలో వారి కృషి అభినందనీయమని ఆయన అన్నారు. ఫిబ్రవరి 7న భూకంప ప్రభావిత దేశానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలన్న ప్రధాని మోదీ ఆదేశాల మేరకు మొత్తం మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అక్కడికి పంపారు. #OperationDost కింద తుది NDRF బృందం Turkiye నుండి తిరిగి వచ్చింది. 151 @NDRFHQ సిబ్బంది & డాగ్ స్క్వాడ్‌లతో కూడిన 3 బృందాలు భూకంప ప్రభావిత టర్కియేకు సహాయం అందించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్‌లో తెలిపారు.
Interacting with personnel involved in #OperationDost in Türkiye and Syria. Their efforts in disaster response and relief measures have been commendable. https://t.co/D80SShsFn3
— Narendra Modi (@narendramodi) February 20, 2023
తాజావార్తలు
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!