Site icon NTV Telugu

PM Modi : పియానో వాయించిన చిన్నారి.. ఫిదా అయిన ప్రధాని

Modi

Modi

పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా చూడముచ్చటగా పియానో వాయించిన చిన్నారి ప్రతిభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫిదా అయ్యారు. చిన్నారి శాల్మలీ ఆమె పియాన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ప్రధాని మోడీ దృష్టిని ఆకర్షించింది. శాల్మలీ ప్రతిభకు ముగ్ధులైన ప్రధాని ఆ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసారు. మహిళతో కలిసి కన్నడ పాట పాడుతూ.. అద్భుతంగా పియాన్ వాయిస్తున్న వీడియోను అనంత్ కుమార్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. పల్లవియాలి అనే పాటకు పియానో వాయిస్తూ.. చిన్నారి శాల్మలీ ప్రదర్శించిన హావభావాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.

Also Read : Balesh Dhankar: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం

అయితే చిన్నారి శాల్మలీ వీడియోను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ షేర్ చేయడంతో మరింత వైరల్ గా మారింది. ఆమెలో అసాధారణమైన ప్రతిభ, సృజనాత్మకత దాగుందన్నారు. భవిష్యత్ లో గొప్ప స్థాయికి ఎదగాలని శాల్మలీకి ప్రధాని మోడీ ఆశీస్సులు అందజేశారు. కాగా పల్లవగల పల్లవియాలి అంటూ చిన్నారి పాడిన పాటను కన్నడ కవి కేఎస్ నరసింహస్వామి రచించారు. ఈ బ్యూటిపుల్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.

Also Read : Matta Dayanand : మే నెలలో పార్టీ మార్పుపై ప్రకటన ఉంటుంది

పక్కనే తియ్యటి సెలయేరు పారుతున్నట్లుగా ఉంది.. మ్యాజిక్ వాయిస్ ప్లస్ బ్యూటిపుల్ ఎక్స్ ప్రెషన్స్ అంటూ సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆన్ లైన్ ప్రేక్షకులకు ఈ చిన్నారి గొంతు కొత్తేమి కాదు. గత సంవత్సరం బాలీవుడ్ సినిమా కబీర్ సింగ్ సినిమాలోని కైసే హువా పాటను అద్భుతంగా పాడింది. ఈ వీడియోను నెటిజన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Exit mobile version