Site icon NTV Telugu

Chevella Road Accident: మృత్యు ఘోష.. ప్రధాని దిగ్భ్రాంతి..! మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Chevella Road Accident

Chevella Road Accident

Chevella Road Accident: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని పేర్కొంటూ, ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాల పట్ల తన సానుభూతిని ప్రకటించారు ప్రధాని మోడీ. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. తక్షణమే మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, అలాగే గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున నష్టపరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

Shafali-Deepthi: అటు బ్యాట్తో.. ఇటు బంతితో.. త్రూ ఛాంపియన్స్ వారిద్దరే..!

ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మృతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దీని వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ తెలుపుతూ.. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక కుటుంబాలకు 5 లక్షలు.. అలాగే ఆర్టీసీ తరఫున రెండు లక్షల రూపాయలు మొత్తం కలిపి 7 లక్షల రూపాయలు మృతుల కుటుంబాలకు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు అధికారులు ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 11 మందిని గుర్తించారు. మృతుల్లో ఏనుగుల కల్పన, బి. నాగమణి, హనుమంతు, గుర్రాల అబిత, గోసల గుణమ్మ, షేక్ ఖలీద్ జహంగీర్ ఉన్నారు. ఇందులో తనుషా, సాయిప్రియ, నందిని అనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతి చెందిన వీరంతా తాండూరులోని వడ్డెర గల్లికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

Chevella: చేవెళ్లలో బస్సు ప్రమాదం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర దిగ్భ్రాంతి

Exit mobile version