NTV Telugu Site icon

Independence Day 2024: భారత ప్రధానులందరిలో సుదీర్ఘ ప్రసంగం.. మునుపటి రికార్డును అధిగమించిన మోడీ

Pm Modi Speech

Pm Modi Speech

Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రధాని మోడీ సుదీర్ఘ ప్రసంగం చేసి తన రికార్డును తానే అధిగమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు 98 నిమిషాల పాటు తన సుదీర్ఘమైన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంతో 2016లో 96 నిమిషాల తన మునుపటి రికార్డును అధిగమించారు. మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు, సగటున 82 నిమిషాలు, భారతీయ ప్రధానులందరిలో సుదీర్ఘమైన ప్రసంగాలుగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ 98 నిమిషాలక పాటు తన సుదీర్ఘ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని చేశారు. మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు సగటున 82 నిమిషాలు కాగా.. భారతదేశ చరిత్రలో ఇతర ప్రధానమంత్రుల కంటే ఎక్కువే కావడం గమనార్హం. ఇంతకు ముందు 2026లో 96 నిమిషాల పాటు మోడీ ప్రసంగించారు. ఇది గతంలో రికార్డుగా ఉండేది. ఆ రికార్డును మోడీ మరోసారి అధిగమించారు. 2017లో మోడీ 56 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇదే మోడీ చిన్న ప్రసంగం. మరోవైపు 11వ సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధానిగా మోడీ నిలిచారు.

*2014లో మోదీ తన తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని 65 నిమిషాల పాటు చేశారు.

*2015లో ఆయన ప్రసంగం దాదాపు 88 నిమిషాల పాటు సాగింది.

*2018లో మోదీ ఎర్రకోట ప్రాకారం నుంచి 83 నిమిషాల పాటు ప్రసంగించారు.

*2019లో ప్రధాని మోడీ దాదాపు 92 నిమిషాలు మాట్లాడారు. ఇది ఇప్పటి వరకు మూడో పెద్ద ప్రసంగం.

*2020లో మోడీ ప్రసంగం 90 నిమిషాల పాటు కొనసాగింది.

*2021లో ఆయన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం 88 నిమిషాల పాటు కొనసాగగా, 2022లో దాదాపు 74 నిమిషాల పాటు ప్రసంగించారు.

*గతేడాది మోడీ ప్రసంగం 90 నిమిషాల పాటు సాగింది.

మోడీ కంటే ముందు, 1947లో జవహర్‌లాల్ నెహ్రూ, 1997లో ఐకే గుజ్రాల్ వరుసగా 72, 71 నిమిషాలు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. నెహ్రూ, ఇందిరా కూడా 1954 , 1966లో వరుసగా 14 నిమిషాల పాటు అతి తక్కువ ప్రసంగాలు చేశారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఎర్రకోట నుంచి అతి తక్కువ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు చేశారు. 2012, 2013లో మన్మోహన్ సింగ్ ప్రసంగాలు వరుసగా 32, 35 నిమిషాలు మాత్రమే సాగాయి. 2002, 2003లో వాజ్‌పేయి ప్రసంగాలు 25, 30 నిమిషాల కంటే తక్కువగా ఉన్నాయి.