Site icon NTV Telugu

Asaduddin Owaisi: ఓట్లు పొందాలంటే ముస్లింలను తిట్టడమే ఉత్తమ మార్గం..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

దేశవ్యాప్తంగా ఓట్లు పొందాలంటే ముస్లింలను తిట్టడమే ఉత్తమ మార్గం అనే రితిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆలోచన అంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఇప్పుడే కాదు ఆయన 2002 నుంచే ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారని విమర్శలు గుప్పించారు. మోడీ అసలు గ్యారంటీ ఓట్ల కోసం ముస్లింలను తిట్టడమేనన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ కామెంట్స్ కు కౌంటర్ గా అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్టర్ ( ఎక్స్ ) వేదికగా పోస్ట్ చేశారు.

Read Also: Train Accident : రైలులో మంటలను ఆర్పే సమయంలో పేలుడు.. కానిస్టేబుల్ మృతి

కాగా, ముస్లింలను ఎప్పుడూ చొరబాటుదారులుగా, ఎక్కువ సంతానం ఉన్న వారిగా మోడీ చిత్రీకరించాడంటూ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను లాక్కుని ముస్లింలకు పంచుతుందని తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సంపద గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మోడీ స్నేహితుల ప్రస్తావన తప్పకుండా వస్తుందని ఆయన గుర్తు చేశారు. దేశ జనాభాలో 40 శాతం మంది దగ్గర ఉన్న సంపద కేవలం మోడీకి ఉన్న కొద్దిమంది (1 శాతం) సంపన్న స్నేహితుల దగ్గరే ఉందన్నారు. హిందువులను భయాందోళనకు గురి చేయడం ద్వారా ఓట్లు పొందాలనే ఎత్తుగడే తప్ప నరేంద్ర మోడీకి మరో ఆలోచన లేదన్నారు. ఆయన ఆరోపణలలో నిజం లేదని అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు.

Exit mobile version