NTV Telugu Site icon

PM Calls ISRO Chief: చంద్రయాన్‌-3 సక్సెస్ తర్వాత ఇస్రో ఛీఫ్‌కు ప్రధాని ఫోన్‌.. వీడియో వైరల్

Pm Calls Isro Chief

Pm Calls Isro Chief

PM Calls ISRO Chief: చంద్రుడిని చేరుకోవడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ప్రధాని మోడీ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో చీఫ్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. “మీ పేరు సోమనాథ్.. చంద్రునితో ముడిపడి ఉంది, కాబట్టి మీ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు” అని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ, “మీ మొత్తం బృందానికి నా వైపు నుండి చాలా అభినందనలు. అలాగే, బెంగళూరులో కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తానని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోడీ ఇస్రో చీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. చంద్రయాన్-3 మిషన్ తర్వాత, ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. ఈ సమయంలో కూడా, మిషన్ విజయవంతం అయినందుకు ఇస్రోను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మిషన్ తర్వాత ప్రతి భారతీయుడి ఛాతీ గర్వించిందని ప్రధాని ప్రసంగించారు.

Read Also: Chandrayaan-3: చందమామపై దిగిన చంద్రయాన్-3.. ఇస్రోకు పంపిన తొలి మెసేజ్‌ ఇదే..

చంద్రయాన్ మిషన్ తర్వాత, ఈ ఘనత సాధించిన శాస్త్రవేత్తలను ఇస్రో చీఫ్ అభినందించారు. ప్రతి ఒక్కరి కృషి వల్లే ఈరోజు ఇస్రో ఈ స్థాయికి చేరుకుందని, భారతదేశం చరిత్ర సృష్టించిందని ఇస్రో చీఫ్ అన్నారు. భారతదేశ మిషన్ చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. దక్షిణ ధృవంపై ఇంతకు ముందు ఏ దేశం కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. అలా చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది.