PM Modi: స్వాతంత్య్రం నాటి నుంచి కాంగ్రెస్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలను ప్రస్తావించిన మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ చారిత్రక తప్పిదాలను ప్రధాని పార్లమెంట్లో ప్రస్తావించారు. కాంగ్రెస్ హయాంలోనే పీఓకేను భారత్ కోల్పోయింది.. నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందని మోడీ అన్నారు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాల పర్యవసానాలను దేశం ఇప్పటికీ అనుభవిస్తోందన్నారు. అక్సాయ్ చిన్ కు బదులుగా, మొత్తం ప్రాంతాన్ని ‘బంజరు భూమి’గా ప్రకటించారని.. దీని కారణంగా మనం దేశంలోని 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోవలసి వచ్చిందన్నారు. 1962- 1963 మధ్య, కాంగ్రెస్ నాయకులు జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, ఉరి, నీలం లోయ, కిషన్గంగాలను వదులుకోవాలని ప్రతిపాదించారన్నారు. 1966లో కాంగ్రెస్ నేతలు రాన్ ఆఫ్ కచ్ పై మధ్యవర్తిత్వాన్ని అంగీకరించారని.. మరోసారి వారు 800 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పాకిస్థాన్‌కు అప్పగించారన్నారు. 1965 యుద్ధంలో హాజీ పీర్ పాస్‌ను సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది కానీ కాంగ్రెస్ తిరిగి ఇచ్చిందన్నారు.
READ MORE: Kingdom : లక్ష టికెట్లు సేల్.. కింగ్ డమ్ హవా..
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
1971లో మన దగ్గర 93 వేల మంది పాకిస్థానీ సైనికులు ఖైదీలుగా ఉన్నారని.. తమ సైన్యం వేల చదరపు కిలోమీటర్ల పాకిస్థాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుందని ప్రధాని మోడీ తెలిపారు. ఆ సమయంలో దృష్టి సారించి ఉంటే POKని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉండేదన్నారు. ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నారని తెలిపారు. కనీసం కర్తార్‌పూర్ సాహిబ్‌ను సైతం తిరిగి సొంతం చేసుకోలేక పోయారన్నారు. 1974లో కచ్చితీవును శ్రీలంకకు బహుమతిగా ఇచ్చారని.. ఇప్పటికీ భారతీయ జాలర్ల ప్రాణాలకు అక్కడ ప్రమాదం పొంచి ఉందన్నారు. దశాబ్దాలుగా, సియాచిన్ నుంచి సైన్యాన్ని తొలగించాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పనిచేస్తోందని.. 2014 లో దేశం వారికి అవకాశం ఇవ్వలేదన్నారు. లేకుంటే నేడు మనకు సియాచిన్ కూడా ఉండేది కాదన్నారు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!