NTV Telugu Site icon

BBC documentary row: ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదాస్పదం.. అసలేం జరిగిందంటే?

Bbc Documentary

Bbc Documentary

BBC documentary row: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో 1,000 మందికి పైగా ముస్లింలు మరణించిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసి) మంగళవారం ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీని విడుదల చేసింది. అల్లర్ల సమయంలో గోద్రాలో హిందూ యాత్రికులు ప్రయాణిస్తున్న రైలును దగ్ధం చేయడంతో హింస చెలరేగినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీ ప్రశ్నించింది. 2002 గుజరాత్ అల్లర్లలో 1,000 మందికి పైగా మరణించారు. వారిలో ఎక్కువ మంది ముస్లింలే కావడం గమనార్హం. “ఇండియా: ది మోడీ క్వశ్చన్” అని రెండు పార్ట్​లతో కూడిన డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది.

ఈ డాక్యుమెంటరీ విడుదలైనప్పటి నుంచి తీవ్రదుమారం రేగుతోంది. ఈ డాక్యుమెంటరీపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ డాక్యుమెంటరీతో వలసవాద మనస్తత్వం అర్థమవుతోందని చెప్పింది. పక్షపాత ధోరణి, కుట్రలో భాగంగానే కథనాన్ని ప్రసారం చేశారని మండిపడింది. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది ఒక నిర్దిష్ట అపఖ్యాతి పాలైన కథనాన్ని ముందుకు తీసుకురావడానికి రూపొందించబడిన ప్రచారంలో భాగమేనని తాము భావిస్తున్నామన్నారు. పక్షపాతం, నిష్పాక్షికత లేకపోవడం, కొనసాగుతున్న వలసవాద మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తాయన్నారు. ఈ డాక్యుమెంటరీ ఉద్దేశం, వెనుక ఉన్న ఎజెండా గురించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని తాము గౌరవించబోమని చెప్పారు. బ్రిటీష్​ మాజీ విదేశీ కార్యదర్శి జాక్​ స్ట్రా అడిగిన ప్రశ్నలకు బాగ్చి స్పందించారు. జాక్​ స్ట్రా చేసిన వ్యాఖ్యలకు బీబీసీ చట్టబద్ధత ఎలా ఇస్తుందని మండిపడ్డారు.

Ambani Dance Video: అనంత్-రాధిక ఎంగేజ్‌మెంట్‌లో అంబానీలు డ్యాన్స్‌తో అదరగొట్టేశారుగా..

పాకిస్థాన్‌కు చెందిన బ్రిటన్‌ ఎంపీ ఇమ్రాన్‌ హుస్సేన్‌ గురువారం బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. భారత ప్రధానిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే, దానిని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సున్నితంగా ఖండించారు. తాము ఎక్కడా హింసను సహించమని.. కానీ ఓ దేశాధినేతను అలా చిత్రీకరించడాన్ని అంగీకరించమన్నారు. దౌత్య సంబంధాల విషయంలో యూకే సర్కారు స్పష్టంగా ఉందన్నారు. భారత్, యూకే మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండదని రిషి సునక్ స్పష్టం చేశారు.

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో హింస చెలరేగినప్పుడు ఆ రాష్ట్ర సీఎంగా మోదీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై తీసిన డాక్యుమెంటరీపై సుప్రీంకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త వినీత్ జిందాల్ శుక్రవారం బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)పై ఫిర్యాదు చేశారు. న్యాయవాది ట్విట్టర్‌లో ఇలా రాస్తూ.. ‘దేశ ప్రజలు ప్రధాని మోదీని ఎన్నుకున్నారు. దేశంలో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఉంది. బీబీసీ న్యూస్ ఈ చర్య భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొట్టే కుట్ర. కాబట్టి, ఇది ప్రమాదకరం, దానిపై చర్య తీసుకోవాలి.’ అని రాసుకొచ్చారు.

 

Show comments