G20 Summit: జీవ ఇంధనంపై ప్రపంచ కూటమి ఏర్పాటు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: దేశ రాజధానిలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో రెండో సెషన్ ప్రారంభమైంది. జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోడీ మొదటి సెషన్లోనే అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. జీ20 తొలి సెషన్‌ను ముగించిన అనంతరం ప్రధాని మోదీ ఈరోజు మీడియాతో మాట్లాడారు. జీవ ఇంధనంపై ప్రపంచ కూటమిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. క్లీన్ ఫ్యూయల్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి జీవ ఇంధనంపై ప్రపంచ కూటమని ఏర్పాటు చేయడానికి అంగీకరించినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ కూటమిలో ప్రపంచమంతా చేరాలని కోరారు. ఈ చొరవలో చేరాలని భారతదేశం యావత్ ప్రపంచాన్ని ఆహ్వానిస్తోందని ప్రధాని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని అన్నారు.
Also Read: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం.. ప్రధాని మోడీ ప్రకటన
Also Read
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. 'పెరి పెరి మసాలా'ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
- Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
- Virat Kohli Records: "నువ్వు మామూలోడివి కాదు సామీ".. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
జీ20 సదస్సులో, పర్యావరణం, వాతావరణ పరిశీలనల కోసం జీ20 ఉపగ్రహ మిషన్ ‘జీ20 శాటిలైట్ మిషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ అబ్జర్వేషన్’ను ప్రారంభించాలని భారతదేశం ప్రతిపాదించింది. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్పై కలిసి పని చేయాలని జీ20 దేశాలను ప్రధాని మోడీ కోరారు. దీనితో పాటు పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని 20 శాతానికి పెంచడానికి భారతదేశం ప్రపంచ స్థాయి చొరవను ప్రతిపాదించింది. సమ్మిళిత శక్తి పరివర్తన కోసం ట్రిలియన్ల డాలర్లు అవసరమని, అభివృద్ధి చెందిన దేశాలు ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ప్రధాని అన్నారు.
జీ-20 సమ్మిట్ తొలి సెషన్ తర్వాత ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు చేశారు. జీ20 సమ్మిట్‌లో ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఏకాభిప్రాయాన్ని ప్రకటిస్తూ దీనిని సాధ్యం చేసేందుకు కృషి చేసిన జీ20 షెర్పాలు, మంత్రులు, ఇతర అధికారులకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. సదస్సు తొలిరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, యూకే పీఎం రిషి సునాక్, ఆస్ట్రేలియా పీఎం ఆంథోనీ అల్బనీస్, జపాన్ పీఎం ఫుమియో కిషిడా, చైనా పీఎం లీ కియాంగ్, ఇండోనేషియా అధ్యక్షుడు విడోడో, సౌదీ అరేబియా క్రౌన్ పిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డా సిల్వా మొదలైన ప్రముఖ ప్రపంచ నాయకులతో సమావేశమయ్యారు.
తాజావార్తలు
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
ట్రెండింగ్
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!