Site icon NTV Telugu

PM Modi Amaravati Tour: ప్రయాణికులకు అలర్ట్.. ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు!

Pm Modi Amaravati Tour

Pm Modi Amaravati Tour

ప్రధాని నరేంద్ర మోడీ రేపు అమరావతికి వస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు ఏపీ పోలీసులు. ఎవరు ఏ రూట్‌లో వెళ్లాలి అనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులోకి వస్తాయి. వీవీఐపీలు, వీఐపీలు నోవాటెల్ వైపు నుంచి బెంజిసర్కిల్ మీదుగా బందరు రోడ్డు వెళ్లి ప్రకాశం బ్యారేజ్ మార్గంలో సభావేదికకు చేరుకుంటారు.

విశాఖ నుండి చెన్నైకి వెళ్లే వాహనాలు త్తిపూడి → కాకినాడ → అమలాపురం → రాజోలు → నరసాపురం → మచిలీపట్నం → రేపల్లె → బాపట్ల → ఒంగోలు మార్గంలో వెళ్లాలి.

చెన్నై నుంచి విశాఖ వైపు వాహనాలు ఒంగోలు → త్రోవగుంట → బాపట్ల → రేపల్లె → అవనిగడ్డ → మచిలీపట్నం → లోస్రా బ్రిడ్జి → నరసాపురం → అమలాపురం → కాకినాడ → కత్తిపూడి మార్గం అనుసరించాలి.

గుంటూరు జిల్లా నుంచి విశాఖ వెళ్లే వాహనాలు బడంపాడు క్రాస్ రోడ్ → తెనాలి → పులిగడ్డ → మచిలీపట్నం → నరసాపురం → కాకినాడ మార్గం ద్వారా ప్రయాణించాలి.

విశాఖ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలు (తూర్పు గోదావరి) – దివాన్ చెరువు → గమన్ బ్రిడ్జి → దేవరపల్లి → గోపాలపురం → జంగారెడ్డిగూడెం → అశ్వారావుపేట → ఖమ్మం → సూర్యాపేట దారి అనుసరించాలి.

కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ → నూజివీడు → మైలవరం → ఇబ్రహీంపట్నం → నందిగామ మార్గంలో ప్రయాణించాలి.

విజయవాడ ఎయిర్‌పోర్ట్ వెళ్లే ప్రయాణికులు రామవరప్పాడు ఫ్లైఓవర్ → ఆంధ్రజ్యోతి → ముస్తాబాద్ → సూరంపల్లి అండర్‌పాస్ → కొత్త బైపాస్ → బీబీగూడెం అండర్‌పాస్ → గన్నవరం చైతన్య స్కూల్ జంక్షన్ వద్దకు చేరుకోవాలి. అక్కడ నుంచి ఎన్‌హెచ్ 16కు వచ్చి అక్కడి నుండి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లవలెను.

Also Read: AP Liquor Scam: పోలీసుల అదుపులో రాజ్‌ కసిరెడ్డి పీఏ.. పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా..!

హైదరాబాద్ రూట్‌లో ప్రయాణికులకి మూడు మార్గాలు (ఏలూరు జిల్లా):
# భీమడోలు → ద్వారకాతిరుమల → చింతలపూడి → ఖమ్మం
# ఏలూరు బైపాస్ → జంగారెడ్డిగూడెం → అశ్వారావుపేట
# ఏలూరు బైపాస్ → చింతలపూడి → సత్తుపల్లి

హైదరాబాద్ నుండి విశాఖ వెళ్లే వాహనాలు (ఎన్టీఆర్ జిల్లా):
# నందిగామ → మధిర → వైరా → సత్తుపల్లి → అశ్వారావుపేట → జంగారెడ్డిగూడెం → దేవరపల్లి → గమన్ బ్రిడ్జి
# ఇబ్రహీంపట్నం → మైలవరం → నూజివీడు → హనుమాన్ జంక్షన్ → ఏలూరు మార్గం

Exit mobile version