PM Modi: ఢిల్లీలోని పార్లమెంట్ ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈసారి పడిన వర్షాలు వ్యవసాయానికి ఊతమిస్తాయి. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. యాక్సియం-4 మిషన్పై మోడీ ప్రశంసలు గుప్పించారు. అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించామని.. ఐఎస్ఎస్ లో మువ్వన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలకు గర్వకారణం అని అన్నారు. భారత సైనిక పాటవాలను ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూసాయి. ఆపరేషన్ సిందూర్తో వంద శాతం లక్ష్యాలను ఛేదించామన్నారు. ఆపరేషన్ సిందూర్తో మన సత్తా ప్రపంచానికి తెలిసింది. తక్కువ సమయంలోనే మన ఆర్మీ టార్గెట్ను కొట్టి చూపించిందని ప్రధాని మోడీ అన్నారు.
Mumbai Local Train Blast: 19 ఏళ్ల తరువాత 12 మంది నిర్దోషులుగా విడుదల చేసిన బాంబే హైకోర్టు
22 నిమిషాల్లోనే పాక్లో ఉగ్రస్థావరాలను మట్టుబెట్టామని, పాకిస్థాన్ ఉగ్రస్థావరాలను మన ఆర్మీ భూ స్థాపితం చేసిందన్నారు. మేడిన్ ఇండియా ఆయుధాలతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించాం. ఆపరేషన్ సిందూర్లో వాడిన ఆయుధాలు వాటి సత్తా నిరూపించుకున్నాయి. మావోయిస్టు ముక్త్ భారత్లో ముందడుగు వేశాం.. దేశంలో మావోయిజం దాదాపుగా అంతమైందని.. అనేక ప్రాంతాలను మావోయిస్టుల నీడ నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. అలాగే వందలాది జిల్లాలు నక్సల్ ఫ్రీ జోన్లుగా మారిపోయాయి.. రెడ్ కారిడార్లు గ్రీన్ జోన్లుగా మారుతున్నాయని ప్రధాని మోడీ వెల్లడించారు.
HHVM : హరిహర రిలీజ్ చిక్కులు.. చక్రం తిప్పిన ముగ్గురు నిర్మాతలు
పహల్గాం ఊచకోతను చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయని, పాక్ నిజస్వరూపాన్ని ఎంపీల బృందం ప్రపంచ దేశాలకు వివరించిందన్నారు. పార్టీలకు అతీతంగా పలు పార్టీలు, పలు రాష్ట్రాల ప్రతినిధులు దేశహితం కోసం పని చేశారు.. వివిధ దేశాల్లో పర్యటించి పాక్ ఉగ్రవాదంపై ఎంపీలు ప్రచారం చేసారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ది మూడో స్థానమని అన్నారు. 25 కోట్ల మందిని దారిద్య రేఖ నుంచి బయటకు తీసుకొచ్చామని మోడీ వ్యాఖ్యానించారు.
