PM-KISAN Funds Release: దేశంలోని కోట్లాది మంది రైతులకు నవరాత్రి కానుకగా ఇచ్చే ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ 9.4 కోట్ల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయలను బదిలీ చేశారు. ఈ రైతులందరి ఖాతాలకు ఒక్కొక్కరికి రూ. 2000 బదిలీ చేశారు. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు మొత్తం రూ.3.45 లక్షల కోట్లు పంపిణి చేసింది.
PM Modi: బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించారు. రైతులకు 3 సమాన వాయిదాల్లో ఏటా రూ.6,000 బదిలీ చేస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా ఈ సొమ్ము రైతుల ఖాతాల్లోకి చేరుతుంది. మహారాష్ట్రలో ఈ పథకంలో 17 విడతలుగా సుమారు 1.20 కోట్ల మంది రైతులకు సుమారు రూ.32,000 కోట్లు అందించారు. సమ్మాన్ నిధి 18వ విడతలో రాష్ట్రంలోని దాదాపు 91.51 లక్షల మంది రైతులకు రూ.1,900 కోట్లకు పైగా లబ్ధి చేకూరనుంది. ఇది కాకుండా, నమో షెత్కారీ మహాసమ్మన్ నిధి యోజన 5వ విడత కింద మహారాష్ట్ర రైతులకు ప్రధాని మోదీ సుమారు రూ. 2,000 కోట్ల అదనపు ప్రయోజనాన్ని అందించారు.
Mallareddy Mass Dance: బతుకమ్మ సంబరాల్లో మల్లారెడ్డి మాస్ డ్యాన్స్
ఈ సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే , ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ లు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలతో సహా 2.5 కోట్ల మంది రైతులు వెబ్‌కాస్ట్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.