Site icon NTV Telugu

PM Kisan 22nd Installment: రైతన్నలకు అలర్ట్.. ఈ ఒక్క తప్పు చేస్తే పీఎం కిసాన్ నిధులు గోవిందా!

Pm Kisan 22nd Installment

Pm Kisan 22nd Installment

PM Kisan 22nd Installment: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (PM-Kisan) 22వ విడత నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. అయితే, ఈసారి భారీ సంఖ్యలో రైతుల ఖాతాల్లోకి నగదు జమ కాకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి 6, 2026 నాటి తాజా నివేదిక ప్రకారం.. సుమారు 30 లక్షల మందికి పైగా రైతులు ఇంకా తమ బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులను ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్’ (DBT) ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపిస్తోంది. దీనికి ఆధార్ సీడింగ్ (Aadhaar Seeding) తప్పనిసరి.

READ ALSO: KTR : ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు.. మహామహులనే ప్రజలు ఓడించారు..!

ఆ 30 లక్షల మందిపై వేటు తప్పదా?
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటికి వరకు ఉన్న మొత్తం పెండింగ్ కేసులు 30,18,361. దీనికి కారణం బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేకపోవడం, అప్లై చేసుకున్న దరఖాస్తులో పేరులో తప్పులు ఉండటం అని అధికారులు తెలిపారు. ఈసారి ఆధార్‌తో పాటు ‘ఈ-కేవైసీ’ (e-KYC), ల్యాండ్ మ్యాపింగ్ కూడా పూర్తయిన వారికే నిధులు అందుతాయని అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

రాష్ట్రాల వారీగా ‘డబ్బులు అందని’ రైతుల చిట్టా ఇదే:

ఉత్తరప్రదేశ్: 10.44 లక్షల మంది

రాజస్థాన్: 2.13 లక్షల మంది

గుజరాత్: 2.90 లక్షల మంది

మధ్యప్రదేశ్: 1.87 లక్షల మంది

మహారాష్ట్ర: 1.72 లక్షల మంది

తెలుగు రాష్ట్రాలు/ఇతర: కర్ణాటక (1.30 లక్షలు), బెంగాల్ (1.22 లక్షలు).

నిధులు ఆగకుండా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి..

మీ ఖాతాలోకి రూ. 2000 రావాలంటే మీరు ఈ రెండు పద్ధతుల్లో మీ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు:

మీ బ్యాంక్ మొబైల్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యి, ‘Aadhaar Seeding’ లేదా ‘Update Aadhaar’ ఆప్షన్ ఎంచుకుని, ఆధార్ నంబర్, OTP ఎంటర్ చేయండి. లేదంటే లేదా pmkisan.gov.in పోర్టల్‌లో ‘e-KYC’ విభాగానికి వెళ్లి చెక్ చేసుకోండి. లేకపోతే మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ‘ఆధార్ లింకింగ్ ఫారమ్’ సమర్పించండి. దీనికి ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్‌బుక్ కాపీ జత చేసి బ్యాంక్‌లో అందజేయండి. అందరూ ఒకటి గుర్తుకు ఉంచుకోండి.. ఆధార్ కార్డులో ఉన్న పేరు, బ్యాంక్ రికార్డుల్లో ఉన్న పేరు అక్షరం పొల్లు పోకుండా ఒకేలా ఉండాలి. ఏ మాత్రం తేడా ఉన్నా సాఫ్ట్‌వేర్ పీఏం కిసాన్ నిధులను రిజెక్ట్ చేస్తుంది. పలు నివేదికల ప్రకారం.. 22వ విడత నిధులు ఫిబ్రవరి మూడో వారం లేదా మార్చి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి వెంటనే ఈ పనులు పూర్తి చేసి మీ అర్హతను కాపాడుకోండి.

READ ALSO: Air India: ఎయిర్ ఇండియాకు రూ.కోటి జరిమానా విధించిన DGCA.. అసలేం జరిగిందంటే?

Exit mobile version