ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు తీపికబురును అందించింది. పీఎం కిసాన్ నిధుల విడుదల తేదీని ప్రకటించింది. ఆగస్టు మొదటి వారంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడతను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. రైతులు చాలా కాలంగా 20వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దాని తేదీ అధికారికంగా నిర్ణయించారు.
Also Read:Minister Nimmala Ramanaidu: పోలవరంపై సమీక్ష.. డయాఫ్రమ్ వాల్ పనుల్లో 40 శాతం పురోగతి..!
వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారిక X ఖాతా ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 2, 2025న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి దేశవ్యాప్తంగా రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ యోజన 20వ విడతను విడుదల చేస్తారని తెలియజేసింది. పీఎం మోడీ ఆగస్టు 2న ఉదయం 11 గంటలకు తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి నుంచి 20వ విడత సమ్మాన్ నిధిని విడుదల చేయనున్నారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను పొందడానికి, e-KYC కలిగి ఉండటం తప్పనిసరి. అదే సమయంలో, లబ్ధిపొందే రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, ప్రతి సంవత్సరం రైతుల ఖాతాకు 6 వేల రూపాయలు జమచేస్తారు. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు ఒకసారి 3 విడతలుగా రైతుల ఖాతాకు బదిలీ చేస్తారు. ప్రతి విడతలో 2,000 రూపాయలు ఇస్తారు. రైతులు pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తమ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.
अब और इंतजार नहीं!
PM-Kisan की 20वीं किश्त 2 अगस्त, 2025 को वाराणसी, उत्तर प्रदेश से सीधे आपके खाते में पहुंचेगी।
मैसेज टोन बजे तो समझिए आपके खाते में किसान सम्मान की धनराशि पहुंच गई है।#AgriGoI #Agriculture #PMKisan #PMKisan20thInstallment @PMOIndia @narendramodi… pic.twitter.com/pgqTLOWNPM— Agriculture INDIA (@AgriGoI) July 29, 2025
