NTV Telugu Site icon

కోవిడ్ చికిత్స ప‌రిక‌రాలు, ఔష‌ధాల‌పై జీఎస్టీ ఎత్తివేయండి..!

GST

ఇప్పుడు ప్ర‌తీ వ‌స్తువుపై జీఎస్టీ.. దీంతో ఏదైనా కొనాలంటేనే ఆలోచించాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయి.. ఇక‌, క‌రోనా ట్రీట్‌మెంట్‌లో ఉప‌యోగించే ప‌రిక‌రాలు, మందుల‌పై కూడా ముక్కుపిండి జీఎస్టీ వ‌సూలు చేస్తున్నారు.. అస‌లే క‌రోనా క‌ష్టాల‌తో ఇబ్బంది ప‌డుతుంటే.. వాటిపై జీఎస్టీ సామాన్యుడికి స‌వాల్‌గా మారింది.. అయితే.. క‌రోనా చికిత్స‌లో ఉప‌యోగించే ప‌రిక‌రాలు మ‌రియు ఔష‌ధాలకు జీఎస్టీ నుంచి మిన‌హాయింపు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.. రెమెడిసివీర్, టోసిలిజుమాబ్, ఫావిపిరవిర్ మ‌రియు ఇత‌ర ఔష‌దాల‌పై జీఎస్టీ ఎత్తివేయాల‌ని పిటిష‌న‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు..

కోవిడ్ 19 మహమ్మారి కొన‌సాగుతోన్న కార‌ణంగా.. కోవిడ్ -19 రోగులకు మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ సాంద్రతలు, వెంటిలేటర్లు, బిపాప్ యంత్రాలు, నియంత్రణ చర్యలు, సహాయక సంరక్షణపై కూడా జీఎస్టీని ఎత్తివేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.. కోవిడ్ సెకండ్‌వేవ్ స‌మ‌యంలో దేశం తీవ్రమైన, వినాశకరమైన ప‌రిస్థితులు నెల‌కొన‌గా.. పైన పేర్కొన్న ఔష‌ధాల‌కు, వైద్య ప‌రిక‌రాల‌కు డిమాండ్ విప‌రీతంగా పెరిగింది.. అయితే, వీటిపై జీఎస్టీ 12 శాతంగా ఉంది.. ఇప్పుడు జీఎస్టీ ఎత్తివేస్తే వినియోగదారునికి మ‌రింత త‌క్కువ ధ‌ర‌కే అవి అందుబాటులోకి రానున్నాయి.. ఇది వారికి ఎంతో దోహ‌దం చేస్తుంద‌ని పిటిష‌న్ పేర్కొన్నారు. ఆ మందులు, సామగ్రిపై మినహాయింపును సిఫారసు చేయకపోవడం జీఎస్టీ కౌన్సిల్ పూర్తి ఉదాసీనతను తెలియ‌జేస్తోంద‌ని పిటిష‌న్ ఆరోపించారు.