Site icon NTV Telugu

Viral: పచ్చదనం వెల్లివిరిసేలా పెళ్లి పిలుపు.. పెళ్లి పత్రికలో చెట్ల విత్తనాలు..!

Wedding Card

Wedding Card

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఓ మధురమైన ఘట్టం. జీవితంలో ఒక్కసారి చేసుకునే ఈ కార్యక్రమంకు వారి స్థాయికి తగ్గట్టు వివాహ సంబరాలను ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరైతే వారి స్థాయికి మించి కూడా చేయడం మనం చూస్తుంటాము. ఇందులో భాగంగానే వివాహ ఆహ్వాన పత్రిక నుండి పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకి కల్పించే సౌకర్యాల నుండి వారు తిరిగి వెళ్లే సమయంలో ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ వరకు అన్ని మంచ్చిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక వివాహ ఆహ్వాన పత్రికలను కొందరు వ్యక్తులు వారి ప్రత్యేక అభిరుచితో తయారు చేయించడం మనం గమనిస్తుంటాము. తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్‌ కు చెందిన ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్‌ కోరకొప్పుల స్వర్ణలత తన కుమార్తె వైష్ణవి వివాహంలో భాగంగా బంధుమిత్రులకు పంచేందుకు ఏకంగా కోయంబత్తూర్‌ కు వెళ్లి 1,250 పత్రికలు, 500 పెన్నులను ఆర్డర్‌ ఇచ్చారు. అయితే వీటి ప్రత్యేకత ఏమైని అనుకుంటున్నారా..? ఈ పత్రికలో తులసి, బంతి, చామంతి విత్తనాలు ఉండడమే ఇందులో ప్రత్యేకత. అదేవిధంగా పెన్నులో వంకాయ, టమాటా, కొత్తిమీర, పాలకూర, ముల్లంగి లాంటి కూరగాయల విత్తనాలు ఉంటాయి.

Read Also: Visakhapatnam: విశాఖలో చిరుత పులి చర్మం రవాణా.. పోలీసుల అదుపులో నిందితులు..

ఇలా తయారు చేసిన పత్రికను కేవలం రెండు గంటల పాటు నీటిలో నానబెట్టిన తరువాత దానిని మట్టిలో పాతిపెడితే చాలు వాతంటకు అవే మొలకలొస్తాయి. స్వర్ణలత తన కుమార్తె పెళ్లిపత్రిక ద్వారా కోనైనా కొత్త మొక్కలకు ప్రాణం పోయాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేయించానని ఆమె చెబుతున్నారు. మీరు మీ ఇంటి కార్యక్రమాలలో ఇలాంటి ఆలోచనతో మరికొన్ని మొక్కలకు ప్రాణం పోయండి.

Exit mobile version