NTV Telugu Site icon

Emergency Landing: ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Nepal

Nepal

Emergency Landing: జనవరిలో జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం తర్వాత విమానయాన భద్రతపై తీవ్ర హెచ్చరికలు ఉన్న నేపాల్‌లో.. శ్రీ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన ఓ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ విమానాన్ని సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఖాట్మండు నుండి నైరుతి నేపాల్‌లోని భైరహవాకు వెళ్లాల్సిన విమానంలో సిబ్బందితో సహా 78 మంది ఉన్నారు.

కుడి ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు పైలట్‌ నివేదించడంతో వెంటనే ఆ విమానాన్ని ఖాట్మండుకు మళ్లించినట్లు శ్రీ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి అనిల్ మనంధర్ చెప్పారు. ఖాట్మండులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని నేపాల్ పౌర విమానయాన అథారిటీ (సీఏఏఎన్) ప్రతినిధి జగన్నాథ్ నిరౌలా తెలిపారు. “అది ల్యాండ్ అయినప్పుడు ఎటువంటి అగ్నిప్రమాదం సంభవించిన సూచనలు లేవు” అని నిరౌలా చెప్పారు.

Read Also: Maharashtra: ‘పంచామృతం’ సూత్రం ఆధారంగా మహారాష్ట్ర బడ్జెట్.. ప్రవేశపెట్టిన ఫడ్నవీస్

మౌంట్ ఎవరెస్ట్‌తో సహా ప్రపంచంలోని 14 ఎత్తైన శిఖరాలలో ఎనిమిదింటికి నిలయమైన పర్వత నేపాల్‌కు తరచుగా విమాన ప్రమాదాలు జరిగిన చరిత్ర ఉంది. వాటిలో చాలా కష్టతరమైన భూభాగాలు, వాతావరణ పరిస్థితులలో ఆకస్మిక మార్పు కారణంగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. జనవరిలో దేశ రాజధాని ఖాట్మండు నుంచి పొకారా వెళ్తుండగా.. ల్యాండింగ్‌ సమయంలో విమానం క్రాష్‌ అయ్యింది. ప్రమాదం జరిగిన విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్టు యతీ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. నలుగురు రష్యా పౌరులు కూడా ప్రమాదంలో చనిపోయారు. ప్రమాదానికి ముందు విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్‌కు కేవలం 10 సెకన్ల ముందు విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే.

Show comments