ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో గత కొన్నేళ్ల పేలవ ప్రదర్శన చేసిన తెలుగు టైటాన్స్.. 12వ సీజన్‌లో నిలకడగా రాణిస్తోంది. వరుస విజయాలతో విజృంభిస్తున్న టైటాన్స్ ఈ సీజన్‌లో ఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం హోరాహోరీగా సాగిన ఎలిమినేటర్-3లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై 46–39తో విజయం సాధించింది. ఈ గెలుపుతో క్వాలిఫయర్-2కు మన తెలుగు టీమ్ అర్హత సాధించింది. ఈరోజు జరిగే క్వాలిఫయర్–2లో పుణేరి పల్టన్‌తో టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. శుక్రవారం దబంగ్ ఢిల్లీతో జరిగే ఫైనల్లో తలపడనుంది.
Also Read: Cyclone Montha: అంతర్వేది బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలం.. లైట్‌హౌస్‌ని తాకుతున్న కెరటాలు!
ఎలిమినేటర్-3 మ్యాచ్ హోరాహోరీగా సాగింది. అయాన్ లోహ్‌చాబ్ మెరుపులతో ఆరంభంలో పట్నా పైరేట్స్ పైచేయి సాధించింది.ఓ సమయంలో 13-9తో పట్నా ముందంజలో నిలిచింది. పుంజుకున్న తెలుగు టైటాన్స్ విరామ సమయానికి 22-20తో ఆధిక్యం సంపాదించింది. ద్వితీయార్ధంలో టైటాన్స్ ఆటగాళ్లు మరింత దూకుడుగా ఆడారు. ముఖ్యంగా భరత్ హుడా రెచ్చిపోయాడు. భరత్ 23 పాయింట్స్ సాధించడంతో పట్నాకు అవకాశం లేకుండా పోయింది. అయాన్ 22 పాయింట్లతో పట్నాను గెలిపించడానికి చాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విజయంతో టైటాన్స్ కోచ్ భావోద్వేగం చెందారు. అతడు కంటతడి పెట్టిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టైటాన్స్ ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
