Site icon NTV Telugu

CM Revanth Reddy: పిలిస్తే పలికే నాయకుడు పీజేఆర్.. పేదవారికి అండగా నిలబడ్డాడు..

Cm Revanth

Cm Revanth

పీజేఆర్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “20 నుంచి 25 ఏళ్లు నగరంలో పీజేఆర్ శకం నడిచింది.. ఇతర ప్రాంతాల నుంచి బ్రతుకు దెరువుకు వచ్చిన వారిపై ఎవరైనా దౌర్జన్యం చేసినా పీజేఆర్ అడ్డుకునేవారు.. పిలిస్తే పలికే నాయకుడు పీజేఆర్.. మంత్రిగా నిరంతరం సేవ చేస్తూ.. పేదవారికి అండగా నిలబడ్డాడు.. సీఎల్పీ నాయకుడిగా కూడా పీజేఆర్ ఎనలేని సేవ చేశాడు.. పీజేఆర్ ఇల్లు ప్రజల సమస్యలు తీర్చేందుకు జనతా గ్యారేజి లా ఉండేది.. ప్రభుత్వం మీద పీజేఆర్ చేసిన పోరాటంతోనే కృష్ణా నీటిని నగరానికి రావడానికి కారణం.. నగరానికి త్రాగునీటి అందించిన ఘనత పీజేఆర్ ది.. నగరంలో మంచి నీరు తాగుతున్న అందరూ పీజేఆర్ కి కృతజ్ఞత చెప్పాలి.. అప్పట్లో పీజేఆర్ నాయకత్వం వహించిన ఖైరతాబాద్ అతిపెద్ద నియోజకవర్గం..

Also Read:Adluri Laxman Kumar: మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి తప్పిన ప్రమాదం..

ఈ శేరిలింగం పల్లి కూడా ఒక నాడు ఖైరతాబాద్ లో భాగమే.. రాజీవ్ గాంధీ టెక్ పార్క్ ను హైదరాబాద్ కు తెచ్చిన ఘనత పీజేఆర్ ది.. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వచ్చాక దానిని హై టెక్ సిటీగా మార్చాడు.. ఇంత గొప్ప నగరాన్ని అభివృద్ధి పరచడానికి సోనియా గాంధీ ఆద్వర్యంలో మేము ఇప్పుడు ముందుకు వచ్చాము.. ఈ నగరం అతి గొప్ప నగరంగా ఎదగాలి.. ఈ నగరం బెంగళూరు, ముంబాయితో కాదు.. న్యూ యార్క్, టోక్యో లతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తాం.. కార్పొరేటర్లు ఈ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకోవాలి.. ప్రజలకు రాజకీయాలకు సంబంధం లేదు.. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చేయాలి.. ఇప్పుడు అభివృద్ధి నీ మత్రమే ప్రజలు చూడాలి..

Also Read:AP Crime: భార్య గురించి తప్పుగా మాట్లాడిన స్నేహితుడు.. కత్తితో దాడి చేసిన భర్త..

దిల్లీలో పొల్యూషన్ పెరిగి అక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వచ్చింది.. ఆనాడు నాయకులు సరైన ప్రణాళిక చేపట్టకపోవడంతో డిల్లీకి ఆ పరిస్థితి ఏర్పడింది.. వరదలు వచ్చినప్పుడు చెన్నై, ముంబై పరిస్థితి చూసాము.. మరి ప్రజలు ఆలోచించి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా తెచ్చుకుందామా.. కొంతమంది నగర అభివృద్ధిని అడ్డుకోవడానికి రాజకీయాలు చేస్తున్నారు.. నగర అభివృద్ధికి విదేశీ పర్యటనలు చేసి ప్రాజెక్టులు తెస్తే.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ అభివృద్ధి ఆగదు.. కోర్టుల్లో కొట్లాడి అక్కడే నాలెడ్జ్ పార్క్ తీసుకొస్తాం.. నాళాల పునరుద్ధన చేసి నగరానికి ముంపు లేకుండా చేస్తున్నాము.. నగరంలో ఆర్టీసీలో ఉన్న డీజిల్ బస్సులకు బదులుగా ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయబోతున్నాయి.. ఆటోలతో కూడా పొల్యూషన్ పెరిగిపోతుంది.. ఆటో వాళ్ళు కూడా డీజిల్ ఆటోలకు బదులు ఎలక్ట్రిక్ అటోలు కొనుక్కోవాలని కోరుతున్నాను..

Also Read:Pradeep Ranganathan : మళ్లీ డైరెక్టర్‌గా ప్రదీప్ – సైన్స్ కథతో సెట్ పైకి !

EV వాహనాలు కొనుక్కునే వారికి టాక్స్ లేకుండా అవకాశం ఇస్తున్నాము.. ఓలా, ఉబర్ లాంటి వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇస్తున్నాం.. నాళాలను కబ్జా చేస్తున్నారు.. నాగార్జున కు చెందిన N కన్వేషన్ కూడా చెరువును ఆక్రమించి నిర్మిస్తే ప్రభుత్వం కూల్చివేసింది.. ఆ తర్వాత రియలైజ్ అయిన నాగార్జున రెండెకరాలు స్వయంగా అప్పజెప్పి రియల్ హీరో అయ్యారు.. ఎన్నో ఏళ్లుగా బతుకమ్మ కుంట గురించి మా హనుమంత రావు పోరాటం చేశాడు.. ఇప్పుడు బతుకమ్మ కుంటకు విముక్తి దక్కింది.. వచ్చే బతుకమ్మ పండుగ ప్రజలు అక్కడే చేసుకోబోతున్నారూ.. హైటెక్ సిటీ అంటే సాధ్యమవుతుందా అని నవ్వుకున్నారు.. కానీ ఇప్పుడు చూస్తే ప్రజలకు అర్థం అవుతుంది.. అలాగే రానున్న రోజుల్లో శేరిలింగం పల్లి కూడా అభివృద్ధి జరుగుతుంది..

Also Read:Bank Holidays in July 2025: వచ్చే నెలలో భారీగా బ్యాంక్ సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?

2029 లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుద్ది.. ఈ శేరిలింగంపల్లి 4, 5 నియోజకవర్గాలు కాబోతుంది.. ఇక్కడి నుండి మరో 5 మంది యువ ఎమ్మెల్యేలు రాబోతున్నారు.. అందరూ కలిసి పనిచేయాలని కోరుతున్నాను.. ప్రతి కుటుంబంలో ఏవో సమస్యలు ఉంటాయి.. అలాగే మన మధ్య కూడా ఉండొచ్చు.. వాటి గురించి శ్రీధర్ బాబు ను కలసి చర్చించండి.. ఇంత మంది ఎంపీ లు ఉన్న రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలి.. మోడీ నుంచి తెలంగాణకి ఏం తెచ్చారో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.. ఎన్నో సార్లు డిల్లీకి వెళ్ళాను.. వెళ్లినప్పుడు ప్రతి మంత్రినీ కలిసి ప్రాధేయ పడ్డాను..

Also Read:Bank Holidays in July 2025: వచ్చే నెలలో భారీగా బ్యాంక్ సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?

రేపు కూడా హైదరాబాద్ కు అమిత్ షా వస్తున్నారు.. స్వయంగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో వెళ్ళి మళ్ళీ హైదరాబద్ అభివృద్ధికి సహకరించాలని కోరుతాం.. కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని కిషన్ రెడ్డిని కోరుతున్నాను.. ఫినాన్సియల్ డిస్ట్రిక్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నాం.. అలాగే పీజేఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి సరైన ప్రదేశం చూడమని అధికారులకు ఆదేశిస్తున్నాను.. చివరి సంవత్సరంలో రాజకీయాల గురించి ఆలోచిద్దాం.. అప్పటి వరకు అందరూ కలిసి పని చేయాలని కోరుతున్నాను” అని సీఎం రేవంత్ తెలిపారు.

Exit mobile version