Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pitru Paksha 2026: పితృ పక్షాలు అనగానే మనకు వెంటనే గుర్తుమొచ్చేది మన పెద్దలకు ఇచ్చే తర్పణాలు, పిండ ప్రధానాలు. ఈ ఏడూ అంటే 2026లో సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం నుంచి పితృ పక్షాలు ప్రారంభమై, అక్టోబర్ 10వ తేదీ శనివారం వరకు కొనసాగుతాయి. భాద్రపద పౌర్ణమి నుంచి మొదలై ఆశ్వయుజ అమావాస్య, అంటే సర్వపితృ అమావాస్య వరకు ఉండే ఈ 16 రోజులు మన హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనవి. ఈ రోజుల్లో మనల్ని వదిలి వెళ్లిన పూర్వీకుల ఆత్మశాంతి కోసం, వారి ఆశీస్సుల కోసం తర్పణం, పిండదానం, శ్రాద్ధ కర్మలు చేస్తుంటాం. శాస్త్రాల ప్రకారం ఈ సమయంలో మన పితృదేవతలు అదృశ్య రూపంలో భూమిపైకి వచ్చి, మనం ప్రేమతో ఇచ్చే నీటిని, అన్నాన్ని స్వీకరిస్తారని నమ్మకం. అయితే ఇక్కడే చాలామంది ఒక చిన్న పొరపాటు చేస్తుంటారు. పూజ, తర్పణం విధివిధానంగానే చేస్తారు కానీ, అది పూర్తయిన వెంటనే తెలీక కొన్ని తప్పులు చేస్తుంటారు. జ్యోతిష్యం, శాస్త్రాల ప్రకారం.. శ్రాద్ధ పూజ పూర్తయిన వెంటనే చేసే 4 పొరపాట్ల వల్ల మనం చేసిన పూజల ఫలితం దక్కదట. అంతేకాదు.. పితృ దోషం చుట్టుముట్టే ప్రమాదం ఉందట. అందుకే ఆ నాలుగు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భోజనం విషయంలో జాగ్రత్త..
మొదటిది, పూజ లేదా తర్పణం పూర్తయిన వెంటనే ఆకలవుతోందని కంగున భోజనానికి కూర్చోకూడదట. శ్రాద్ధ కర్మలు పూర్తయ్యాక ముందుగా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఆ తర్వాత పంచబలి, అంటే ఆవు, కుక్క, కాకి, దేవుడు, చీమల కోసం భోజనంలో కొంత భాగాన్ని పక్కన తీసి ఉంచాలి. పితృదేవతలకు, ఈ పంచబలులకు ఆహారం సమర్పించిన తర్వాతే ఇంట్లో వాళ్లు సాత్విక భోజనం చేయాలి. తొందరపడి ముందే తినేయడం అస్సలు మంచిది కాదట.
Also Read
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. 'పెరి పెరి మసాలా'ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
మద్యం, మాంసం తీసుకోకూడదు..
రెండోది, ఆహారం విషయంలో నియమం. తర్పణం ఇచ్చేసినంత మాత్రాన పని అయిపోలేదు. పితృ పక్షాలు నడుస్తున్నన్ని రోజులు ఇల్లు, వండుకునే తిండి చాలా సాత్వికంగా ఉండాలి. పూజ తర్వాత పొరపాటున కూడా మద్యం, మాంసం తీసుకోకూడదు. చివరికి ఇంట్లో వండే వంటల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా వాడకూడదు. ఇవి తామసిక పదార్థాలు కాబట్టి, వీటి వల్ల పితృదేవతలు కోపగించుకుని ఇంట్లో ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంది.
ప్రవర్తన ముఖ్యం..
మూడోది, మన ప్రవర్తన. పితృ పక్షాల్లో పూర్వీకులు మన చుట్టుపక్కలే సూక్ష్మ రూపంలో సంచరిస్తుంటారని అంటారు. అలాంటప్పుడు తర్పణం అయిపోగానే ఇంట్లో అరవడం, కోప్పడటం, ఒకరినొకరు తిట్టుకోవడం లాంటివి చేస్తే ప్రతికూల శక్తులు పెరుగుతాయి. ముఖ్యంగా శ్రాద్ధ పూజ తర్వాత కోపం, అహంకారం పక్కన పెట్టి పెద్దలను, కుటుంబ సభ్యులను గౌరవించాలి. అలాగే ఆ సమయంలో ఇంటి ముందుకొచ్చిన పేదలను గానీ, జంతువులను గానీ విసుక్కుని తరిమేయకుండా, వాళ్లకు తోచిన అన్నమో, నీళ్లో ఇవ్వడం చాలా ముఖ్యం.
వేడుకలు చేసుకునే రోజులు కావు..
నాలుగోది, ఆడంబరాలకు దూరంగా ఉండటం. పితృ పక్షాలు అనేవి మన పూర్వీకులకు నివాళులు అర్పించే సంయమన సమయం తప్ప, వేడుకలు చేసుకునే రోజులు కావు. అందుకని పూజ లేదా తర్పణం చేసిన రోజున గడ్డం చేసుకోవడం, జుట్టు లేదా గోళ్లు కత్తిరించుకోవడం లాంటివి చేయకూడదు. అలాగే పూజ ముగిసిన వెంటనే కొత్త బట్టలు, వాహనాలు, ఆస్తులు కొనడం లేదా కొత్తగా ఏవైనా శుభకార్యాలు ప్రారంభించడం లాంటివి చేయకుండా కొద్దిరోజులు వాయిదా వేసుకోవడమే మంచిది.
మరి శ్రాద్ధ పూజ చేసిన పూర్తి ఫలం దక్కాలంటే..?
తర్పణం, పిండదానం పూర్తయ్యాక మన చేతులతో ఆవుకు పసిరిక లేదా బెల్లం పూసిన రొట్టె వేయాలి. అలాగే కాకికి, కుక్కకు కొంత ఆహారం పెట్టాలి. మన శాస్త్రాల్లో కాకిని పితృదేవతల రాయబారిగా భావిస్తారు, కాబట్టి మనం కాకికి పెట్టే అన్నం నేరుగా మన పూర్వీకులకే చేరుతుందని నమ్ముతారు. ఇవన్నీ చేశాక, ఎలాంటి స్వార్థం లేకుండా మన మనసులోనే పితృదేవతలను తలుచుకుంటూ, తమ కుటుంబానికి సుఖసంతోషాలు, ప్రశాంతత ప్రసాదించమని వేడుకుంటే వారి పూర్తి ఆశీస్సులు మనకు లభిస్తాయి.
తాజావార్తలు
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Delhi PUC Rules: వాహనదారులకు అలర్ట్.. PUC గడువు ముగిసిందా? అక్టోబర్ 1 నుంచి రూ.10 వేల వరకు చలాన్
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!