NTV Telugu Site icon

Vanga Geetha: పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు: వంగా గీత

Vanga Geetha Pawan

Vanga Geetha Pawan

Vanga Geetha on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అని పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. పిఠాపురంను అప్రతిష్ట పాలు చేసే విధంగా పవన్ మాట్లాడవద్దన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి 25 ఏళ్లుగా తానేం చేశానో ప్రజలకు తెలుసని వంగా గీత పేర్కొన్నారు. 2024 శాసనసభ ఎన్నికలలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌, వంగా గీతలు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో ఎన్నికల వేళ పిఠాపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి.

Also Read: TDP-Janasena: కూటమిలో ‘లోకల్’ పంచాయతీ.. టీడీపీపై అసంతృప్తి వెళ్లగక్కుతున్న జనసేన నాయకులు!

ఆదివారం ఉదయం ఎన్టీవీతో పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత మాట్లాడుతూ… ‘పిఠాపురంను అప్రతిష్ట పాలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడవద్దు. నియోజకవర్గానికి 25 ఏళ్లుగా నేనేం చేశానో ప్రజలకు తెలుసు. పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. కూటమి అందరూ కలిసి ప్రజలకు వాలంటీర్లను దూరం చేశారు. నా దగ్గర పిఠాపురం అభివృద్ధికి ప్రత్యేక ఎజెండా ఉంది. ప్రజలను చులకన చేసే విధంగా పవన్ డబ్బులు కంటైనర్లు అంటూ మాట్లాడుతున్నారు. మండలాల వారీగా మా నేతలు ప్రచారం చేస్తే తప్పేంటి?’ అని ప్రశ్నించారు.