NTV Telugu Site icon

Dorababu Pendem: వైసీపీకి మరో షాక్.. పార్టీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు రాజీనామా

Dorababu Pendem

Dorababu Pendem

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా పార్టీ మార్పుపై వార్తలొస్తున్న నేపథ్యంలో నేడు రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ.. “వైసీపీ కి రాజీనామా చేస్తున్నాను. 25 ఏళ్ళు గా పిఠాపురం ప్రజానీకం తో మమేకం అయి ఉన్నాను. పిఠాపురం ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవు. అనుచరులుతో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాను. పిఠాపురం లోనే ఉంటాను. ప్రజలందరికీ అండగా ఉంటాను.” అని ఆయన వ్యాఖ్యానించారు.

READ MORE: US arrests Pakistani: డొనాల్డ్ ట్రంప్‌ సహా మరికొందరి హత్యకు ప్లాన్ చేసిన పాకిస్థానీ..

కూటమి పార్టీలతో చేరనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కానీ..కూటమీలో ఏ పార్టీ అనేది నిర్ణయాన్ని మాత్రం కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత వెల్లడిస్తానని తెలిపారు. జగన్ తో తనకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. “నాకు ఎవరితో ఇబ్బంది అనేది మీకు తెలుసు. జనసేనకి, పవన్ కి నా వలన ఉపయోగం ఉన్న సూచనలు చేస్తాను. కూటమిలో అన్ని పార్టీలు నుంచి ఆహ్వానం ఉంది. పెత్తనం చేయడానికి వెళ్లడం లేదు” అని మాజీ ఎమ్మె్ల్యే దొరబాబు పేర్కొన్నారు.

READ MORE:Serena Williams-Restaurant: పారిస్ రెస్టరెంట్‌లో సెరెనాకు అవమానం.. వివరణ ఇచ్చిన మేనేజ్‌మెంట్!

కాగా.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీకి పలువురు నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తాజాగా కీలకమైన పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పార్టీకి వీడ్కోలు పలికారు. గత కొద్ది రోజులుగా అనుచరులకు పార్టీకి రాజీనామా చేయడంపై సంకేతాలు ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీలోకి వెళుతారని జోరుగు టాక్ నడుస్తోంది.
YCP, Latest Telugu News, AP News, Pithapuram, Pawan Kalyan, Former MLA Pendem Dorababu, Pendem Dorababu, Jana Sena, Alliance Parties, Jagan

Show comments