NTV Telugu Site icon

Pinnelli Ramakrishna Reddy : ఈవీఎం ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్..

Pinnelli Ramakrishna Reddy

Pinnelli Ramakrishna Reddy

Pinnelli Ramakrishna Reddy : ఈవీఎం ధ్వంసం, మరో మూడు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. ఏపీలో మే 13 వ తేదీన పోలింగ్‌ జరగగా, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండలోని పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ నెం.202 లో ఆనాటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పి. రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనను భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే శాసనసభలో సిట్టింగ్ సభ్యుడు (ఎమ్మెల్యే) ఉద్దేశపూర్వకంగా ఈవీఎం ధ్వంసం చేయడం నేరపూరిత చర్యగా మాత్రమే కాకుండా.. ప్రజాస్వామ్య ప్రక్రియపై జరిగిన ఘోరమైన దాడిగా పరిగణించింది. ఈ సంఘటనను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చాలా తీవ్రంగా పరిగణించింది. వీడియో ఫుటేజ్ లను పరిశీలించిన తదుపరి ఎమ్మెల్యేను తక్షణమే అరెస్టు చేయాలని మే 21న ఈసీఐ ఆదేశించింది. దింతో అప్పటి మాచర్ల మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక నమోదైన కేసు నుండి తప్పించుకునేందుకు నిందితులు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషనను దాఖలు చేయగా.. దానిని ఏపీ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయంతో ఈవీఎంల ధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.

AFG vs SA : సఫారీల దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ విలవిల.. 56 అల్ అవుట్..

ఇక తాజాగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించించింది న్యాయస్థానం. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో వాదనలు విన్న న్యాయమూర్తి., ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టి, దాడి చేసిన నాలుగు కేసుల్లో విచారణ చెప్పట్టారు. ఇందులో రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. మరో రెండు కేసుల్లో న్యాయమూర్తి ఆయనకు రిమాండ్ విధించారు. దింతో మాజీ ఎమ్మెల్యే వైసిపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకు తరలించాలని ఆదేశించారు.

Train Accident : ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన తొమ్మిది కోచ్ లు.. 70మందికి గాయాలు