NTV Telugu Site icon

Pigeon: పావురాలు ఈ కలర్ లో కూడా ఉంటాయా? చూస్తే షాక్ అవ్వాల్సిందే

Pigeon

Pigeon

Pink Pigeon: పావురాలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వాటితో ఫోటోలు దిగాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అవి గుంపుగా ఉన్న చోటుకు వెళ్లి చాలా మంది వాటికి గింజలు కూడా వేస్తూ ఉంటారు. అవి ఒక్కసారిగి పైకి ఎగిరితే అప్పుడు వచ్చే ఫోటో కోసం చాలా మంది తంటాలు కూడా పడుతూ ఉంటారు.  సాధారణంగా పావురాలు తెలుపు, నలుపు, బూడిద రంగులో ఉంటాయి. అయితే ప్రస్తుతం నెట్టింట్లో ప్రత్యక్ష్యమవుతున్న ఓ పావురం ఫోటో మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఇందులో పావురం పింక్ కలర్ లో కనిపిస్తుంది. ఈ విచిత్రమైన పావురంయూకేలోని గ్రేట్‌ మాంచెస్టర్‌ వద్ద టౌన్‌ సెంటర్‌  సమీపంలో దర్శనమిచ్చింది.  చాలా మంది రోడ్డుపై తిరుగుతూ రద్దీగా ఉన్న సమయంలోనే ఈ పక్షి కనువిందు చేసింది. అయితే  మొదటగా చూసిన వెంటనే దాన్ని పావురం అని ప్రజలు అనుకోలేదు. ఏదో వింత పక్షి అనుకున్నారు. అయితే మొత్తం పరిశీలించాక అది పావురమే అని నిర్ధారించుకున్నారు అక్కడి ప్రజలు. దీంతో దానిని తెగఫోటోలు తీసుకున్నారు.

Also Read:  Egg Price: సెప్టెంబర్లో కొన్నేళ్ల రికార్డులను బద్దలు కొట్టిన కోడి గుడ్లు.. హోల్ సేల్లోనే రూ.550కు 100

పావురం సాధారణంగా పింక్ కలర్ లో ఉండదు. ఏదైన రంగు దానిపై పడటం వల్ల అలా ఉందా అని అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే గతంలో న్యూయార్క్‌ నగరంలో జెండర్‌ రివీల్‌ పార్టీలో అట్రాక్షన్‌ కోసం అని ఓ పావురానికి గులాబీ రంగు వేశారు. అయితే ఆ సమయంలో ఆ పావురం బంధింపబడి ఉంది. అయితే ఇక్కడ మాత్రం పావురం చాలా స్వేచ్ఛగా ఉంది. అందుకే ఇది నిజంగానే పింక్ కలర్ లో ఉన్న అరుదైన పావురమే అనిపిస్తుంది. అయితే దీనిని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసిన ఓ యూజర్ ఈ పావురాన్ని మీరు ఎక్కడైనా చూశారా? ఇది పింక్ కలర్ లో ఎందుకు ఉంది అంటూ రాసుకొచ్చాడు. దీనిని చూసిన చాలా మంది తాము కూడా ఇలాంటి పావురాన్ని మాంచెస్టర్ టౌన్ సెంటర్ సమీపంలోనే చూశామంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే అది ఎందుకు పింక్ కలర్ లో ఉంది అన్న విషయాన్ని మాత్రం ఎవరు తెలపలేదు.