Pineapple Rava Kesari Recipe: నోట్లో వేస్తే వెన్నెల్లా కరిగిపోయే మౌత్ మెల్టింగ్ ‘పైనాపిల్ రవ్వ కేసరి’ చేసేయండి ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pineapple Rava Kesari Recipe: మనం రెగ్యులర్ గా చేసుకునే రవ్వ కేసరి కంటే కొంచెం భిన్నంగా, ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేకుండా, నాచురల్ పైనాపిల్ తో చేసుకునే టేస్టీ అండ్ సాఫ్ట్ కేసరి ‘పైనాపిల్ రవ్వ కేసరి’. దీనిని మనం ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదా ప్రసాదంలా దేవుడికి పెట్టాలనుకున్నప్పుడు తక్కువ సమయంలో ఇంట్లోనే ఈజీగా ఈ స్వీట్‌ను సిద్ధం చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తాయారు చేయాలో ఏంటో ఇప్పుడు చూద్దాం..
Iran Religious Dictatorship: మానవత్వం ఎక్కడో చచ్చిపోయింది.. మేధావులకు రాజకీయాలే ఎక్కువయ్యాయా?
Also Read
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
కావలసిన పదార్థాలు:
* సన్న రవ్వ (సూజి): 1 కప్పు
* పైనాపిల్ ముక్కలు: 1 కప్పు (సన్నగా తరిగినవి)
* పంచదార: 2 కప్పులు
* నీళ్లు: 3 కప్పులు
* నెయ్యి: తగినంత
* జీడిపప్పు, కిస్మిస్: సరిపడా
* కుంకుమపువ్వు: చిటికెడు (రంగు కోసం)
* యాలకల పొడి: అర టీస్పూన్
తయారీ విధానం:
* ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. అదే నేతిలోకి ఒక కప్పు సన్నగా తరిగిన పైనాపిల్ ముక్కలను వేయండి. (ముక్కలు ఇష్టం లేని వారు మిక్సీలో కాస్త క్రష్ చేసి కూడా వేయొచ్చు). పైనాపిల్ ముక్కలు మెత్తగా మగ్గే వరకు నేతిలో వేయించి, అందులో ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసి అది కరిగే వరకు కుక్ చేయండి. ఇలా ఉడికించిన ముక్కల్లో కొన్నింటిని పక్కన పెట్టి, మిగిలిన వాటిని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పెట్టుకోండి.
Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు
* కడాయిలో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఒక కప్పు రవ్వను వేయండి. రవ్వ ఎంత బాగా వేగితే కేసరి అంత రుచిగా ఉంటుంది. అవసరమైతే మధ్యలో మరికొంత నెయ్యి వేస్తూ రవ్వను సన్నటి సెగ మీద దోరగా వేయించండి.
* మరొక పక్క స్టవ్ మీద గిన్నె పెట్టి, 3 కప్పుల నీటిని పోయండి. ఇందులో కుంకుమపువ్వు వేసి నీటిని బాగా మరిగించండి.
* రవ్వ వేగి రంగు మారాక, మనం ముందుగా సిద్ధం చేసుకున్న పైనాపిల్ పేస్ట్‌ను అందులో వేయండి. రవ్వ, పైనాపిల్ పేస్ట్ కలిసిపోయేలా రెండు నిమిషాలు వేయించండి. దీనివల్ల పైనాపిల్ ఫ్లేవర్ రవ్వకు బాగా పడుతుంది. ఇప్పుడు మరిగించిన వేడి నీటిని రవ్వలో పోస్తూ, ఉండలు కట్టకుండా గరిటతో బాగా కలుపుతూ ఉడికించండి.
* మిశ్రమం దగ్గర పడ్డాక, రెండు కప్పుల పంచదార (లేదా బెల్లం) వేయండి. పంచదార కరిగాక కేసరి కాస్త పల్చబడుతుంది. మరో 2-3 నిమిషాలు కలుపుతూ ఉడికిస్తే కేసరి దగ్గర పడుతుంది. చివరిగా యాలకల పొడి, వేయించిన జీడిపప్పు, మరికొంత నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆపేయండి.
* అంతే.. నోట్లో వేస్తే వెన్నెల్లా కరిగిపోయే పైనాపిల్ రవ్వ కేసరి సిద్ధం. ఈ కొలతలతో మీరు ట్రై చేస్తే టెక్స్చర్ సాఫ్ట్ గా, స్వీట్ కరెక్ట్‌గా వస్తుంది. ఈ సారి మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి.
తాజావార్తలు
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?