NTV Telugu Site icon

Pineapple Ganesh:తిరుపతిలో వెరైటీ… పైనాపిల్ గణేష్ కి భారీ లడ్డూ

Ganesh 1 (2)

Ganesh 1 (2)

అసలే అది కలియుగ వైకుంఠం.. టెంపుల్ సిటీ.. నిత్యం అక్కడికి వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. రోజూ కనీసం లక్షమంది వరకూ భక్తులు తిరుపతికి వచ్చి.. ఏడుకొండలపై వెలసిన శ్రీనివాసుడిని దర్శించుకుంటూ వుంటారు. తిరుపతిలో ఈ ఏడాది గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ బాలాజి తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వినాయ‌క చ‌వితిని పుర‌స్క‌రించుకుని ప‌లు వినూత్న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని తుమ్మ‌ల‌గుంట‌లో వినూత్నంగా వినాయకుడిని ఏర్పాటుచేశారు. పైనాపిల్ పండ్ల‌తో భారీ వినాయ‌క ప్ర‌తిమ‌ను ఏర్పాటు చేశారు. ఈ వినాయ‌కుడికి తాజాగా 1,116 కిలోల భారీ ల‌డ్డూను నైవేద్యంగా పెట్టారు.

వెయ్యి నూట ప‌ద‌హారు కిలోల భారీ ల‌డ్డూను పైనాపిల్ వినాయ‌కుడికి నైవేద్యంగా పెట్టిన వీడియోను చెవిరెడ్డి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ భారీ ల‌డ్డూను వేలం వేయ‌బోమ‌ని, పైనాపిల్ వినాయ‌కుడి నిమ‌జ్జ‌నంలో పాలుపంచుకునే భ‌క్తుల‌కు ఉచితంగా పంపిణీ చేస్తామ‌ని చెవిరెడ్డి తెలిపారు.భారీ పైనాపిల్ గణపతిని దర్శించేందుకు పోటెత్తారు భక్తజనం. తిరుపతి నగరంతో పాటు జిల్లా నలుమూలల నుంచి తరలి వస్తున్న గణపతి భక్తులతో కోలాహలం నెలకొంది. అదే విధంగా తుమ్మలగుంటలో బాల వినాయక ప్రతిమలు భక్తులను మంగళ వాయిద్యాలు వాయిస్తున్న వినాయకుడు చిన్నారులతో పాటు పెద్దల్ని కూడా ఆకట్టుకుంటున్నాయి.

ప్లాస్టిక్‌ బ్యానర్‌ రహితంగా జగనన్న తీసుకున్న నిర్ణయం పర్యావరణ హితానికి దోహదం చేస్తుందని చెవిరెడ్డి అన్నారు. పర్యావరణం కోసం లక్షకు పైగా మట్టి వినాయక ప్రతిమల్ని తయారుచేయించి, అందరికీ ఉచితంగా పంచారు చెవిరెడ్డి. చంద్రగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో 1.24 లక్షల మట్టి వినాయక విగ్రహాల తయారీ సాధ్యమైందన్నారు. మరోవైపు తిరుపతిలో నేడు గణేశ్‌ నిమజ్జనం జరగనుంది. వినాయక సాగర్ లో నిమజ్జనానికి సిద్ధమయ్యాయి వేలాది గణేశ్‌ విగ్రహాలు.. భారీ పోలీస్ బందోబస్తు…నగరంలో ట్రాఫిక్ మళ్ళింపు చేపట్టారు పోలీసులు.