Site icon NTV Telugu

Pileru Forest Case: పీలేరు రేంజ్ అటవీ శాఖలో ఇద్దరు ఉద్యోగుల తొలగింపు

Pileru Forest Red Sandalwood

Pileru Forest Red Sandalwood

ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్లు కు సహకరించిన పీకేరు రెంజ్‌లోని ఇద్దరు అటవీ శాఖ ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా అటవీశాఖ అధికారి సాయిబాబా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ విషయాన్ని ఆశాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. కాస్త ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. పీలేరు కార్యాలయంలో పని చేస్తున్న తలపుల సెక్షన్ అధికారి శ్రీనివాసన్ అలియాస్ స్వామి, ఉస్తికాయల పెంట బీట్ అధికారి రెడ్డెప్ప, అసిస్టెంట్ బీట్ అధికారి విజయభాస్కర్, నూతన కాల్వ చెక్పోస్టు అధికారి జయబ్బ 2021లో ఎర్రచందనం అక్రమ రవా ణాలో స్మగ్లర్లకు సహకరిస్తూ ఆధారాలతో అధికారులకు పట్టుబడ్డారు.

Also Read: BCCI Chief Selector: నో అజిత్ అగర్కర్.. బీసీసీఐకి కొత్త చీఫ్ సెలెక్టర్ రేసులో మాజీ పేసర్!

అప్పట్లో సస్పెండ్ అయిన వీరు పలుకుబడిని ఉపయోగించి 2022లో విధుల్లో చేరగలిగారు. ఇదే కేసుపై ప్రత్యేక పరిశోధన బృందంతో విచారణ జరిపించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్తూరు పర్యటనకు వచ్చినప్పుడు అటవీ శాఖ అధికారులతో సమీక్షించారు. అటవీ శాఖలో ఇంటి దొంగల పని పట్టాలని అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం అక్రమరవాణాలో పట్టుబడిన జయబ్బ మృతి చెందారు. ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీనివాసన్ అలియాస్ స్వామి, ఏబీవో విజయ్ భాస్కర్ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించినట్లు జిల్లా అధికారి ఈనెల 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం బయటకు రాకుండా పీలేరు అటవీశాఖ అధికారులు గోప్యత పాటించారు. అయినా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.

Exit mobile version