Site icon NTV Telugu

African Swine Fever: ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కలకలం.. ఒక్కరోజే 85 పందులు మృతి

African Swine Fever

African Swine Fever

African Swine Fever: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని కట్ని జిల్లాలో ఇప్పటివరకు 85 పందులు చనిపోయాయని, 115 పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు గుర్తించామని సోమవారం ఒక అధికారి తెలిపారు.ఆ ప్రాంతంలో సర్వే నిర్వహించి వ్యాధి సోకిన పందులను ఏరివేసేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. వ్యాధితో పందులు చనిపోయినందుకు పరిహారం మొత్తం కూడా ఇవ్వబడుతుంది.

ఇప్పటి వరకు 85 పందులు చనిపోగా, 115 ఫీవర్‌ సోకిన పందులను గుర్తించారని వెటర్నరీ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్‌కే సింగ్ వెల్లడించారు. ఈ వ్యాధి సోకిన ప్రదేశం నుంచి కిలోమీటరు వ్యాసార్థం వరకు సోకుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తొమ్మిది కిలోమీటర్ల వ్యాసార్థంలో ఈ వ్యాధి సోకిందని వెల్లడించారు. నాలుగు బృందాలు ఆ ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నాయని, రెండు రోజుల్లో సర్వే పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత వ్యాధి సోకిన మండలాల్లో పందులను చంపుతామని, పందుల యజమానులకు కూడా పరిహారం అందజేస్తామని ఆయన తెలిపారు.

Sukesh Chandrashekar: ఆప్‌పై సీబీఐ విచారణ జరిపించాలి.. సుఖేష్‌ చంద్రశేఖర్‌ తీవ్ర ఆరోపణలు

కేంద్ర ప్రభుత్వం నుంచి పరిహారం అందిందని, పందుల బరువును బట్టి పంపిణీ చేస్తామన్నారు. మొత్తం కనిష్టంగా రూ. 2200, గరిష్టంగా రూ.15,000 మధ్య ఉంటుందని ఆర్కే సింగ్ చెప్పారు. జబల్‌పూర్ నుంచి నిపుణుల బృందం కూడా రానుంది. సర్వే పూర్తయిన వెంటనే బృందం ఇక్కడికి చేరుకుంటుందని, తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Exit mobile version