NTV Telugu Site icon

Chittoor Crime: సినిమాకు తీసుకెళ్తానని చెప్పి యువతిపై అత్యాచారం

Physical Harassment

Physical Harassment

Chittoor Crime: దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. చిన్నారులకు చాక్లెట్ ఆశజూపి అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు ఎన్నో చూశాం. యువతులకు వారికి నచ్చిన వాటిని ఇస్తానని ఆశలు రేపి అత్యాచారాలకు పాల్పడిన నేరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో చోటుచేసుకుంది. సినిమాకు తీసుకెళ్తానని చెప్పి ఓ యువకుడు యువతిపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిసింది.

Read Also: Telanga Police: బీ కేర్‌ ఫుల్‌.. టెలిగ్రామ్‌లో వచ్చే లింక్స్‌ ఎట్టిపిస్థితుల్లో క్లిక్‌ చేయొద్దు..

కార్వేటి నగరం మండలం కత్తెరపల్లి గ్రామానికి చెందిన యువతి( 17)ని తమిళనాడులోని పల్లిపట్టుకు ఆదివారం రాత్రి సినిమాకు తీసుకెళ్తానని మార్గమధ్యంలో పొలంలోకి తీసుకెళ్లి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ వ్యక్తి. యువతి తండ్రి కార్వేటినగరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతామని ఎస్సై రాజ్‌కుమార్ వెల్లడించారు.