Site icon NTV Telugu

Vijayawada: బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. రోగిపై లైంగిక దాడి..!?

Vijayawada

Vijayawada

Vijayawada: ఆడవాళ్లు కనిపిస్తే చాలు.. కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏ పరిస్థితిలో ఉన్నారు కూడా చూడకుండా లైంగికదాడులకు పాల్పడుతున్నారు.. పిసికూనలు, బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఘాతుకానికి పాల్పడుతున్నారు.. తాజాగా, విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మరోసారి కలకలం రేగింది.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిపై లైంగిక దాడికి యత్నించాడో వ్యక్తి.. గత అర్థరాత్రి మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించగా.. అది గమనించిన తోటి రోగులు.. అటెండర్లు.. కామాంధుడి దుశ్చర్యను అడ్డుకున్నారు.. ఈ ఘటనపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు..

Read Also: Minister Kakani Govardhan Reddy: గ్రామాల్లో టీడీపీ కనుమరుగు.. చంద్రబాబుకు పిచ్చి పట్టింది..!

ఇక, స్థానికుల సమాచారంలో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. భాదితురాలు మచిలీపట్నంకు చెందిన నాగలక్ష్మిగా తెలుస్తుండగా.. నిందితుడు గుంటూరుకు చెందిన చంద్రశేఖర్‌గా గుర్తించారు పోలీసులు.. ఇక, ఆస్పత్రిలో బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. కాగా, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో గతంలో యువతిపై సామూహిక లైంగిక దాడి ఘటన చోటుచేసుకున్న విషయం విదితమే.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేసే ఓ ప్రబుద్ధుడు మానసిక దివ్యాంగురాలైన యువతికి ఉద్యోగం ఆశ చూపి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఆస్పత్రిలో మరో ఇద్దరు ఒప్పంద కార్మికులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించిన విషయం విదితమే.

Exit mobile version