Site icon NTV Telugu

Photo Vastu Tips: ఇంట్లో పిల్లల ఫోటోలను ఆ దిశలో మాత్రమే పెట్టాలి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!

Photo Vastu Tips

Photo Vastu Tips

Vastu Tips For Kids Photo: ఇల్లు లేదా వ్యక్తి జీవితం నుంచి ప్రతికూల శక్తిని నాశనం చేసే అనేక విషయాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. ఇంట్లో వస్తువులను సరైన దిశలో లేదా సరైన స్థలంలో ఉంచితేనే.. సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. అంతేకాదు లక్ష్మీదేవి ఆనందం మరియు శ్రేయస్సును ఇస్తుంది. ఏ వస్తువునైనా ఇంట్లో ఉంచడానికి మంచి దిశ చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు అంటున్నారు. అయితే మనం ఈ విషయాలను ఎప్పటికప్పుడు విస్మరిస్తూనే ఉంటాం.

చాలామంది తమ పిల్లల ఫోటోలను ఇంటి గోడలపై ఉంచుతారు. దాంతో వారి బాల్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటుంటారు. అయితే ఫోటో పెట్టేప్పుడు చేసే చిన్న పొరపాటు కూడా మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుందని తెలుసా?. ఫోటోలను గోడలపై ఉంచడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను దృష్టిలో ఉంచుకుని ఇంట్లో పిల్లల ఫోటోలను పెడితే.. ఆ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. ఫోటోలను ఎలా, ఎక్కడ పెట్టాలో (Kids Photo Rules) ఓసారి చూద్దాం.

# వాస్తు ప్రకారం పశ్చిమ దిశ పిల్లలు మరియు సృజనాత్మకతకు సంబంధించినది. అందుకే పశ్చిమ దిశ పిల్లల ఫోటోలు పెట్టడానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో ఫొటోలు ఉంచడం వల్ల చదువులో మరింత పదును పెట్టి జీవితంలో ముందుకు సాగుతారు.

# జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు ఒకే కొడుకు ఉంటే.. అతని ఫోటోను దక్షిణం వైపున పెట్టాలి. దీంతో మీ అబ్బాయి బాధ్యుడు అవుతాడు. మొత్తం కుటుంబాన్ని చూసుకునే ధైర్యం అతనికి వస్తుంది.

# మీరు మీ పిల్లల ఫోటోను తూర్పు దిశలో ఉంచినట్లయితే.. అది పిల్లలను ప్రకాశవంతంగా మరియు శక్తివంతంగా మారుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాగే దేవుని దయ వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది.

# జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్య దిశలో పిల్లల చిత్రాలను పెట్టొచ్చు. మీరు పిల్లలతో ఉన్న ఫోటోను కూడా పెట్టుకోవచ్చు. ఈశాన్య దిశలో కుటుంబ ఫోటోను ఉంచడం అత్యంత శుభప్రదం. ఇలా పెడితే కుటుంబ సంబంధాలు బలమవుతాయి.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)

 

Exit mobile version