Site icon NTV Telugu

Prabhakar Rao : హైదరాబాద్‌ చేరుకున్న ప్రభాకర్‌ రావు.. ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్‌ ఆఫీసులో ప్రాసెస్‌

Prabhakar Rao

Prabhakar Rao

Prabhakar Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం రాత్రి చేరుకున్నారు. 15 నెలల విరామం తర్వాత ఆయన స్వదేశానికి పయనించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆయన విమానాశ్రయంలోనే ఇమ్మిగ్రేషన్ అధికారుల ఎదుర్కొన్నారు. లుకౌట్ నోటీసులు అమలులో ఉండటంతో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్‌ స్కానింగ్ సమయంలో అధికారులకు అలర్ట్ వెళ్లింది. వెంటనే విచారణ అధికారులకు సమాచారం అందించారు. అన్ని క్లియరెన్స్‌లు వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికార లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం ఆయన నగరానికి అనుమతించబడ్డారు.

Payal Rajput : కత్తిలాంటి అందాలన్నీ చూపించిన పాయల్ రాజ్ పుత్..

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ను ప్రధాన నిందితుడిగా సిట్ గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. రేపు (సోమవారం) ఆయన సిట్ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో A1గా నమోదు చేసిన అధికారులు, కీలక ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగా, సిట్ కార్యాలయాన్ని మాసబ్ ట్యాంక్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు మార్చడం మరో ఆసక్తికర అంశంగా మారింది. రేపటి విచారణ నేపథ్యంలో ఈ మార్పు కీలకంగా మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారంపై ఉత్కంఠ పెరిగింది.

Job Notification: హెల్త్ డిపార్ట్మెంట్లో భారీగా ఉద్యోగాలు.. జి.ఓ. విడుదల..!

Exit mobile version