Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి సిట్‌ముందుకి శ్రవణ్‌రావు.. అరెస్ట్ తప్పదా..?
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి సిట్‌ముందుకి శ్రవణ్‌రావు
- ఇవాళ హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చిన సిట్
- మూడు రోజుల క్రితం హాజరై అసంపూర్తిగా సమాధానాలు ఇచ్చిన శ్రవణ్‌రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా సంస్థ యజమాని శ్రవణ్‌రావు బుధవారం మరోసారి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఎదుట హాజరుకానున్నారు. గత విచారణలో ఆయనను అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వకపోవడంతో, అధికారులు ఆయనకు తిరిగి నోటీసులు పంపారు.
ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారంతా పోలీసు అధికారులే కాగా, శ్రవణ్‌రావు మాత్రం ప్రైవేట్ వ్యక్తి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన జోక్యం చేసుకున్నారు? ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్ అధికారులతో ఆయనకు పరిచయం కల్పించినది ఎవరు? ఆయన కార్యాలయంలో హ్యాకింగ్ పరికరాలను ఏర్పాటు చేయడానికి ప్రణీత్‌రావు వెనుక కారణమేమిటి? ఈ వ్యవహారంలో ఎవరెంత మంది సంభాషణలను విన్నారు? దీని ద్వారా ఎవరైనా ఆర్థికంగా లబ్ధి పొందారా? అనే అంశాలపై అధికారులు స్పష్టత తీసుకురావాలని భావిస్తున్నారు.
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
కాంగ్రెస్, బీజేపీ నేతలు, రేవంత్ రెడ్డి అనుచరుల ఫోన్ నంబర్లు ట్యాపింగ్ టీంకు ఎందుకు అందించబడ్డాయి? ఆ వివరాలను శ్రవణ్‌రావుకు అందించినది ఎవరు? గత ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులకు ఆయన ఏ సమాచారాన్ని ఇచ్చారు? వంటి ప్రశ్నలపై SIT మరింత లోతుగా విచారణ జరుపుతోంది.
ఇప్పటికే అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, శ్రవణ్‌రావులను ముఖాముఖి విచారణకు సిద్ధమవుతున్నారు. శ్రవణ్‌రావు తనకు ప్రణీత్‌రావుతో మాత్రమే పరిచయం ఉందని చెబుతున్నప్పటికీ, రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలతో ఆయన జరిపిన ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరందరినీ కూడా విచారణకు పిలవాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
LSG vs PBKS: దంచికొట్టిన ప్రభ్ సిమ్రాన్.. లక్నోపై పంజాబ్ విజయం
తాజావార్తలు
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!