Phone Tapping Case: సిట్ విచారణ పూర్తి.. ఇంటికి వెళ్లిపోయిన ప్రభాకర్ రావు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ పూర్తి
- ఇంటికి వెళ్లిపోయిన ప్రభాకర్ రావు
- జనవరి 16న సుప్రీంకోర్టు విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ పూర్తయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వారాల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రభాకర్ రావును విచారించింది. 14 రోజుల కస్టడీ విచారణ నిన్నటితో ముగియగా.. ఈరోజు ఉదయం వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన్ను కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు అప్పగించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కస్టోడియల్ విచారణ పూర్తయిన తర్వాత సిట్ వైద్య పరీక్షలు చేసింది.
రెండో వారం విచారణలో ప్రభాకర్ రావు నుంచి సిట్ బృందం కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. మొదట విచారణకు సహకరించని ఆయన.. పూర్తి ఆధారాలు ముందు ఉంచడంతో కొన్నిటికి సమాధానాలు చెప్పారట. ప్రభాకర్ రావు తన పై అధికారుల పేర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారట. ఇక టాపింగ్ కేసులో ఓ పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా పనిచేసిన సమయంలో పెన్ డ్రైవ్‌లో టాపింగ్ వివరాలు స్టోర్ చేశారట. రెండు వారాల విచారణకు సంబంధించిన రిపోర్టును సుప్రీంకోర్టుకు సిట్ బృందం అందించనుంది. జనవరి 16న ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ సహా ఫోన్ టాపింగ్ కేసులో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
Also Read
తాజావార్తలు
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్‌లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!