Site icon NTV Telugu

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావుపై వేటు.. డీఎస్పీ నుంచి సీఐగా డిమోట్

Phone Tapping Case

Phone Tapping Case

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీ నుంచి సీఐగా ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు ముందు డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు.. అరెస్ట్ అనంతరం సస్పెండ్ అయ్యారు. 2007 బ్యాచ్‌కు చెందిన ప్రణీత్ రావుకు గతంలో కల్పించిన యాక్సిలరేటెడ్‌ పదోన్నతి రద్దయినట్లయింది. ఇకపై ఆయన ఇన్‌స్పెక్టర్‌గానే కొనసాగనున్నారు.

READ MORE: Chandrababu and Pawan Kalyan: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..!

ఇదిలా ఉండగా.. గత ప్రభుత్వ హయాంలో SIB (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) డీఎస్పీగా పని చేసిన దుగ్యాల ప్రణీత్‌ రావు కిందట సస్పెండ్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్‌ చేసినట్లు ఆయనపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహారశైలిపై విచారణ చేయించారు. విచారణలో అది నిజమని తేలటంతో ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. 2023 నవంబర్ 15న ఒకేరోజు 650 ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని… మావోయిస్టుల నేతలతో వీరికి సంబంధాలు ఉన్నాయంటూ రాజకీయ నేతల నెంబర్లను పంపించి రివ్యూ కమిటీ ద్వారా గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే ఫోన్‌లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలో వాటికి సంబంధించి ప్రభాకర్ రావును కూడా దాదాపు మూడు సార్లు విచారించారు సిట్ అధికారులు. తాజాగా  ప్రభాకర్ రావు డీఎస్పీ నుంచి సీఐగా డిమోట్ చేయడం సంచలనంగా మారింది.

READ MORE: Varanasi : ఆ ఒక్క షాట్ కోసం ఆరు నెలల ట్రైనింగ్ తీసుకున్నాను.. ఆ కష్టం మాటల్లో చెప్పలేను.. మహేష్ బాబు కామెంట్స్
https://www.yoursite.com/

 

Exit mobile version