మనం ఇంట్లో ఉంటే మొబైల్ కు ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకుంటారు.. మనం పని చేసే చోట కూడా చార్జింగ్ పెడతారు.. అంతవరకు బాగానే ఉంది కానీ మనం ఎప్పుడైనా దూర ప్రయాణాలకు వెళ్లినప్పుడు రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్ లో ఫోన్ కు చార్జింగ్ పెట్టుకుంటాము.. అలా చేస్తే కొన్నిసార్లు ఫోన్ హ్యాక్ కు గురవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు..
మీరు అత్యవసర పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో మీ ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే జ్యూస్ జాకింగ్ మోసాల బారిన పడి మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. అమాయక ప్రజలకు ట్రాప్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ఇలాంటి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను టార్గెట్ చేస్తున్నారు.. ఆ ఛార్జింగ్ పాయింట్స్ ద్వారా చార్జింగ్ పెట్టుకోవడం వల్ల మన ముఖ్యమైన డేటా సులువుగా ట్రాన్స్ఫర్ అవుతుందట..మీరు జ్యూస్ జాకింగ్ స్కామ్ బారిన పడొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ కేబుల్‌ను కనెక్ట్ చేసి ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఛార్జ్ చేయడం ప్రారంభించినప్పుడల్లా, స్క్రీన్‌పై పాప్-అప్ కనిపిస్తుంది.
మీరు చార్జింగ్ పెట్టగానే ఈ కేబుల్‌ని వాడాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఈ నోటిఫికేషన్‌ను చాలా మంది స్కిప్ చేస్తున్నారు. దీంతో మాల్వేర్ వైరస్ నెమ్మదిగా మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లోకి ప్రవేశిస్తుంది. మీ ఫోన్ హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.. అవేంటో ఒక్కసారి చూసేద్దాం..
ముందుగా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఫోన్ కు ఫుల్ గా ఛార్జింగ్ పెట్టుకొని ఉండటం మంచిది.. కనీసం మనకు సరిపడా అయినా చార్జింగ్ ఉండేలా చూసుకోవడం మర్చిపోకండి.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ ప్లేసులలో ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లో ఏదైనా వార్నింగ్ నోటిఫికేషన్ వస్తే, వెంటనే ఛార్జింగ్ తీసేయాలి.. లేకుంటే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది..మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచేందుకు మీతో సొంత కేబుల్స్‌తో ఛార్జ్ చేయాలి. దీన్నుంచి డేటా ట్రాన్స్‌ఫర్ ఏం అవ్వదు.. ఇది గుర్తుంచుకుంటే మంచిది..